నిమ్మగడ్డ రిటర్న్ గిఫ్ట్ అదేనా?

Tue Aug 04 2020 23:00:15 GMT+0530 (IST)

Is Nimmagadda Return Gift?

వైసీపీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అని ఎడతెగని పంచాయితీని పెట్టుకున్న ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ చివరకు కోర్టుల్లో గెలిచి జగన్ ను ఓడించి బాధ్యతలు చేపట్టారు. అయితే తనను ఇంతలా చేసిన  వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడని టాక్ వినిపిస్తోంది.ఎస్ఈసీగా మళ్లీ పదవి చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్ ఫుల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని సమాచారం. ఆయన పదవీ కాలానికి ఇంకా 8 నెలల సమయం ఉంది. ఈ టైంలో ఎన్నికలు జరిగితే వైసీపీకి చుక్కలు చూపించేలా అతడు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని ఇప్పటికే టాక్ ఉంది.

అయితే రాష్ట్రం అంతా వైసీపీకి ఏకగ్రీవంగా అయిన స్థానిక సంస్థల ఎన్నికలను నిమ్మగడ్డ రద్దు చేయవచ్చు అని టాక్ వినిపిస్తోంది. ఆ ఎన్నికల కోడ్ చెల్లదు అని ఒక ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ తాజాగా ఎన్నికలు తీసుకొని రావచ్చు అని ప్రచారం సాగుతోంది. అప్పుడు కలెక్టర్లు ఎస్పీలు అందరినీ మార్చేసి తాజాగా ఎన్నికలు నిర్వహిస్తారని... అదే వైసీపీకి నిమ్మగడ్డ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని సమాచారం. వైసీపీ ప్రభుత్వం అడిగితే రూల్స్ ప్రకారం చేస్తున్నానంటూ బదులు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు టీడీపీకి మేలు చేసేలా నిమ్మగడ్డ స్థానిక ఎన్నికల్లో చక్రం తిప్పుతారని తెలుస్తోంది.

ఈ ఎనిమిది నెలల్లో వైసీపీకి ఎలాంటి లాభం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. మరి అది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందనేది వేచిచూడాలి.