Begin typing your search above and press return to search.

నిత్యానంద సొంత దేశం.. 'కైలాస' రూల్స్ ఇవే !

By:  Tupaki Desk   |   4 Dec 2019 11:19 AM GMT
నిత్యానంద సొంత దేశం.. కైలాస రూల్స్ ఇవే !
X
నిత్యానంద.. ఈయన పేరుకే బాబా ..లోపల పెద్ద డేరాబాబా. ఎందరో అమాయకమైన అమ్మాయిల జీవితాలతో ఆదుకున్నాడు. బయట ప్రపంచానికి బాబా గా బిల్డప్ ఇస్తూ ..లోలోపల తతంగం మొత్తం నడిపించేవాడు. నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్‌. ఈయన 2000 సంవత్సరంలో బెంగళూరు సమీపంలో ఒక ఆశ్రమాన్ని మొట్టమొదటగా నెలకొల్పాడు. ఆ తరువాత బాబా గా మంచి గుర్తింపు లభించడం తో అడ్డు అదుపు లేకుండా దేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయాడు.

ఇక తమిళనాడుకు చెందిన నిత్యానంద.. 2010లో ఓ సినీ నటితో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్న వీడియో బయటకు రావడంతో వార్తల్లోకెక్కాడు ఆ ఘటనకు సంబంధించి లైంగికదాడి కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. అలాగే ఈ మద్యే అహ్మదాబాద్‌లోని మరో ఆశ్రమంలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతోపాటు, అతనిపై మరో సెక్స్‌ కుంభకోణం కూడా గత నెలలో బట్టబయలైంది. దీనితో అందరూ దేశం వదిలి పారిపోయినట్టు భావించారు ..అందరూ అనుకున్నట్టే ..నిత్యానంద దేశం వదిలి వెళ్ళిపోయి .. కొత్త దేశాన్ని స్థాపించారు.

పాస్‌పోర్టు లేకుండా దేశం వదిలి పారిపోయిన నిత్యానంద సెంట్రల్‌ అమెరికాలో ఈక్వెడార్‌కు సమీపంలో ఒక కొత్త దేశాన్ని స్థాపించినట్టు ప్రకటించాడు. దాని పేరు కైలాస అని, తమకు ప్రత్యేక పాస్‌పోర్టు ఉందని తెలిపాడు. కొత్త దేశం పేరిట వెబ్‌సైట్‌ కూడా ప్రారంభించిన నిత్యానంద, ఆ తరువాత ఈ ప్రపంచంలోనే గొప్ప హిందూ దేశం అని చెప్పుకున్నాడు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఒక దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద, దానిని నూతన స్వతంత్ర దేశంగా చెప్పుకుంటున్నాడు. తనదేశంలో పౌరసత్వం పొందాలని ఆహ్వానం పలుకుతున్నాడు. అలాగే నిత్యానంద అదే సమయంలో పరిపాలన సాగించేందుకు విరాళాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. అలాగే గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ 'దేశ' వెబ్‌సైట్‌ తెలిపింది.

ఈ దేశానికీ సంబంధించి మెరూన్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను కూడా రూపొందించారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానిగా 'మా'ని నియమించారని, రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. తన 'కైలాస' కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద తెలిపారు.