Begin typing your search above and press return to search.

బీజేపీ-శివసేన లొల్లిపై స్పందించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్

By:  Tupaki Desk   |   20 Nov 2019 9:04 AM GMT
బీజేపీ-శివసేన లొల్లిపై స్పందించిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్
X
దేశంలోనే కరుడుగట్టిన రెండు హిందుత్వ పార్టీలు శివసేన - బీజేపీ. ఈ రెండు కలిసి మహారాష్ట్రలో కలిసి పోటీచేశాయి. గతంలో ప్రభుత్వాన్ని పంచుకున్నాయి. అయితే బీజేపీకి సీట్లు తగ్గడంతో శివసేన సీఎం కుర్చీని పంచుకుందామని అంది. దానికి బీజేపీ నో చెప్పడంతో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రపతి పాలన సాగుతోంది. ఇప్పుడు హిందుత్వ శివసేన పార్టీ లౌకిక వాదులైన ఎన్సీపీ - కాంగ్రెస్ లో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇలా ఒక తల్లి పిల్లలుగా ఉండే శివసేన - బీజేపీ మధ్య చోటుచేసుకున్న లొల్లిపై వారి గాడ్ ఫాదర్ అయిన ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవాథ్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

సుధీర్ఘకాలంగా పరస్పర అనుబంధంతో సాగిన శివసేన - బీజేపీలో ఇలా సీట్ల కోసం గొడవపడి విడిపోవడం రెండు పార్టీలకు నష్టమని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీల నేతలకు స్వార్థం మంచిది కాదని హెచ్చరించారు. స్వార్థాన్ని వీడిన వారు విజేతలవుతారని చెప్పుకొచ్చాడు.

పదవుల కోసం తగువులాడి.. ఘర్షణలకు దిగితే అది రెండు పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ-శివసేన పట్టువీడాలని మోహన్ భగవత్ సూచించారు.