Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు శృంగారం.. ఇక్కడి ప్రజల వింత ఆచారం ఇదీ

By:  Tupaki Desk   |   24 Oct 2021 9:33 AM GMT
పెళ్లికి ముందు శృంగారం.. ఇక్కడి ప్రజల వింత ఆచారం ఇదీ
X
మన దేశంలో శృంగారం పేరు చెప్పగానే చాలా మంది సిగ్గు పడుతారు. అయితే రహస్యంగా మాత్రం మాత్రం ఇలాంటి కథనలు ఇంట్రెస్టుగా వింటారు. ఇక పెళ్లికి ముందు సెక్స్ అనేది దేశంలో దాదాపుగా ఎవరూ ఒప్పుకోరు. సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే దేశంలో ఏం చేయాలనుకున్నా పెళ్లి తరువాతే. అయితే కొందరు సీక్రెట్ గా కలుసుకుంటానంటే అది వారిష్టం. కానీ పెళ్లికి ముందు యువతీ, యవకులకు సెక్స్ చేసుకునే అవకాశం ఇస్తారు ఇక్కడి వారు. అంతేకాకుండా అందులో సామర్థ్యం ఉంటేనే ఆ తరువాత పెళ్లి చేస్తారు. ఇలాంటి వింత ఆచారం ఎక్కడో లేదు. మనదేశంలోనే ఉంది. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా..?

మనదేశంలో దట్టమైన అటవీ ప్రాంతం ఎక్కువగా ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో ఉంది. బస్తర్ జిల్లాలోని అడవుల్లో ఇంద్రావతి నదికి సమీపంలో మురియా తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా జీవిస్తారు. ఎక్కువగా అడవుల్లో మాత్రమే జీవించే వీరికి బయటి ప్రపంచం గురించి ఎక్కువగా తెలియదు. వారికి కావాల్సిన ఆహారాన్ని వారి ప్రాంతాల్లోనే పండించుకొంటారు. ఇక్కడ వరి, బఠాని, కూరగాయలను ఎక్కువగా పండిస్తారు. ఇదంతా నక్సల్స్ ప్రాంతం కావడం వల్ల ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి రావడానికి కూడా సాహసించరు.

అయితే మురియా తెగల ప్రజల్లో ఓ వింత ఆచారం ఉంది. వీరి దృష్టిలో సెక్స్ అనేది సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని నమ్ముతారు. అందుకే యువతీ, యువకులకు పెళ్లి వెంటనే పెళ్లి చేయరు. వారికి 14 ఏళ్ల వయసు రాగానే ముందుగా వారిని ఏకాంతంగా వదిలేస్తారు. వారం రోజుల పాటు వారు మాట్లాడుకోవచ్చు. సరదాగా గడపొచ్చు.. అంతేకాకుండా లైంగికంగా కూడా పాల్గొనవచ్చు. అయితే వీరు ఉన్న చోటికి వేరేవాళ్లను ఎవరినీ రావివ్వరు. ఆ ప్రాంతాన్ని పకడ్బందీగా చూసుకొంటారు.

వారం రోజుల తరువాత యువకుడి సామర్థం గురించి ఆ యువతి తెలుపుతుందన్నమాట. అంటే వారం రోజులు వీరు ఏకాంతంగా గడిపిన తరువాత యువకుడు ఓ పువ్వును తెచ్చి ఆ యువతి తలలో పెడుతాడు. అలా యువకుడు యువతి తలలో పువ్వు పెట్టనిస్తే వారికి పెళ్లి చేస్తారు. అయితే యువతి పువ్వు పెట్టడానికి ఒప్పుకోకపోతే మళ్లీ వారు ఇతర యువకులు, యువతులతో కలిసి వారం రోజులు గడుపొచ్చు. ఈ వింత ఆచారం దశాబ్దాలుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు వీరు దగ్గరిగానే ఉన్నట్లు కనిపించినా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల వీరి గురించి ఎక్కువగా ఎవరికీ తెలిసే అవకాశం లేదు.

కానీ కొందరు మేధావులు వీరి గురించి తెలిసి అక్కడి ప్రాంతాన్ని సందర్శించారు. బయటి ప్రపంచం గురించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొందరు చదువుకోవడంతో వారిలో అవగాహన కలుగుతోంది. అయితే పెళ్లి విషయంలో మాత్రం సనాతన సాంప్రదాయాన్నే కొనసాగిస్తామంటన్నారు ఇక్కడివారు. కానీ కొందరు వీరిని కలిసిన వారు బాల్య వివాహాలపై, ఆరోగ్య సమస్యలపై వివరిస్తున్నారు. వారి భవిష్యత్ గురించి తెలియజెప్పుతున్నారు.

ఇదిలా ఉండగా మురియా తెగల ఆచారంతో ఇక్కడ లైంగిన నేరాలేమీ జరగవట. ఎందుకంటే 14 ఏళ్లు నిండగానే యువతీ, యువకులను వారి ఇష్టాలకే వదిలేస్తారు. దీంతో లైంగికంగా వారు ఇష్టమొచ్చిన వ్యక్తితో గడుపొచ్చు. అయితే సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న ఈ ఆచారాలను రూపు మాపేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా గ్రామ పెద్దలు, ఇతరులు మాత్రం బయటి సాంప్రదాయాలను ఒప్పుకోవడం లేదు. అంతేకాకుండా వారి సాంప్రదాయాలను మార్చే అవకాశం ఇతరులకు ఇవ్వడం లేదు. అయితే రాను రాను ఇక్కడి పరిస్తితి ఏ విధంగా మారుతుందో చూడాలి.