డోంట్ వర్రీ ..నేను బాగున్న : ఎమ్మెల్యే రోజా !

Sat Jul 11 2020 17:30:01 GMT+0530 (IST)

Don't Worry .. I'm Good: MLA Roza!

తాజాగా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. గన్ మెన్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అవ్వగానే .. వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనితో అప్రమత్తమైన రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే తన గన్ మెన్ కి పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే రోజా కి ఎక్కడ పాజిటివ్ వస్తుందో ఏమో అని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు.తన ఆరోగ్యం పై ఎవరు ఆందోళన చెందవద్దు అని నేను క్షేమంగా ఉన్నాను అని తెలిపింది. అలాగే పాజిటివ్ గా నిర్దారణ అయిన ఆ గన్ మెన్ గత 18 రోజులుగా విధులకు హాజరుకాలేదు అని తెలిపారు.

కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మహమ్మారిని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటునప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 25422 కేసులు నమోదయ్యాయి. 292 మంది కరోనాతో మృతిచెందారు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.