రోహిత్.. సరిగ్గా మూడేళ్లకు సెంచరీ.. మోతెక్కుతున్న ఇండోర్

Tue Jan 24 2023 15:47:16 GMT+0530 (India Standard Time)

Rohit Sharma Century in India Vs NewZealand

13 ఓవర్లకు 100.. 24 ఓవర్లకు 200.. ఓపెనర్ల సెంచరీలు.. ఒకరు 83 బంతుల్లో మరొకరు 72 బంతుల్లోనే మూడంకెల మార్కుకు.. ఇండోర్ వన్డేలో టీమిండియా విశ్వరూపమిది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఓపెనర్లు శుబ్ మన్ గిల్ ( 112 78b 13x4 5x6 )  రోహిత్ శర్మ 101 (85b 9x4 6x6 ) చెలరేగారు. 26 ఓవర్లలోనే 212 పరుగులు జోడించి దుమ్మురేపారు.న్యూజిలాండ్ తప్పులో కాలు..

ఇండోర్ మైదానం చాలా చిన్నది. పిచ్ బ్యాటింగ్ కు పూర్తిగా అనుకూలం. అలాంటిచోట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుంది. కానీ టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేథమ్ బౌలింగ్ ఎంచుకొన్నాడు. ఇదెంత తప్పుడు నిర్ణయమో రోహిత్ గిల్ దూకుడు చాటిచెప్పింది. 18 ఓవర్లోనే 150 పరుగుల మార్క్ దాటింది టీమిండియా. గిల్ రోహిత్ నేనంటే నేనంటూ ఫోర్లు సిక్స్ లతో విరుచుకుపడ్డారు. కాగా భారత్ ఈ మ్యాచ్ లో షమీ సిరాజ్‌కు విశ్రాంతినిచ్చింది. పేసర్ ఉమ్రాన్ మాలిక్ స్పిన్నర్ చాహల్‌కు అవకాశం ఇచ్చింది.

మూడేళ్ల తర్వాత రోహిత్ మూడంకెలు

రెండేళ్ల కిందటే వైస్ కెప్టెన్ అయి ఏడాది కిందట మూడు ఫార్మాట్లకూ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సెంచరీ చేయక మూడేళ్లయింది. ఆ లోటును మూడే వన్డేలో తీర్చాడు. రోహిత్ 101 పరుగులు చేసి ఔటయ్యాడు. టిక్నర్ వేసిన 26.1 బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 212 పరుగుల వద్ద టీమ్‌ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది.

మరో ఓపెనర్ గిల్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ నెల 18న కివీస్‌తో తొలి వన్డేలో (208) డబుల్ సెంచరీ బాదిన గిల్.. మూడో వన్డేలో శుభ్‌మన్ సెంచరీ చేశాడు. అంటే వారం వ్యవధిలోన డబుల్ సెంచరీ సెంచరీ కొట్టాడు. గిల్ 72 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు.  కాగా రోహిత్ 83 బంతుల్లో అతడు మూడంకెల స్కోరు చేశఆడు. వన్డేల్లో అతడికిది 30వ సెంచరీ. హిట్‌మ్యాన్ వన్డేల్లో మూడేళ్ల తర్వాత సెంచరీ బాదడం విశేషం. ఈ సెంచరీకి ముందు 2020 జనవరి 19న ఆస్ట్రేలియాపై శతకం చేశాడు.

పోటాపోటీగా సిక్సర్ బాది హాఫ్ సెంచరీ

రోహిత్ గిల్ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్న తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ పోటాపోటీగా బౌండరీలు బాదారు. డారిల్ మిచెల్ వేసిన 15 ఓవర్లో రోహిత్ మూడు ఫోర్లు బాదగా.. శాంటర్న్ వేసిన తర్వాతి ఓవర్‌లో గిల్ ఫోర్ సిక్స్ బాదాడు. 17 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 147/0. గిల్ (67) రోహిత్ (77) క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. శాంటర్న్ వేసిన 13.1 ఓవర్‌కు సిక్సర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో 50 పరుగుల మార్కు అందుకున్న రోహిత్‌కిది వన్డేల్లో 49వ అర్ధ శతకం.

ఇదే ఓవర్లో మూడో బంతికి హిట్‌మ్యాన్ మరో సిక్స్ బాదాడు. 14 ఓవర్లకు స్కోరు 114/0. రోహిత్ (58) గిల్ (54) క్రీజులో ఉన్నారు. టీమ్‌ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్..  శాంటర్న్ వేసిన 12వ ఓవర్‌లో రెండో బంతికి ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అతడు 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కుని అందుకున్నాడు. 12 ఓవర్లకు స్కోరు 97/0. ప్రారంభంలో ఆచితూచి ఆడిన భారత బ్యాటర్లు రోహిత్ శర్మ (39*) శుభ్‌మన్ గిల్ (41*) వీరబాదుడు మొదలెట్టారు. లాకీ ఫెర్గూసన్ (8వ ఓవర్) వేసిన ఓవర్‌లో గిల్ నాలుగు ఫోర్లు సిక్స్ సాయంతో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. జాకబ్ (10వ) బౌలింగ్‌లో రోహిత్ రెండు సిక్స్‌లు ఫోర్ బాదేశాడు. వీరిద్దరి దూకుడుతో 10 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా స్కోరు  82/0కి చేరింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.