Begin typing your search above and press return to search.

బ్యాటింగ్ పిడుగు మిల్కీ బ్యూటీ ల‌వ్ లో!

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:38 AM GMT
బ్యాటింగ్ పిడుగు మిల్కీ బ్యూటీ ల‌వ్ లో!
X
మైదానంలో దిగి ఫోర్లు సిక్స‌ర్ల‌ తో దంచ‌డం కొంద‌రి శైలి. ఈ కేట‌గిరీ లోనే టీమిండియా యంగ్ బ్యాట్స్ మ‌న్ రిష‌బ్ పంత్ పాపుల‌ర‌య్యాడు. అత‌డికి యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ప్ర‌స్తుతం వెస్టిండీస్ తో భార‌త్ టీ20ల్లో రిష‌బ్ ఆడిన రెండు మ్యాచుల్లో బౌండ‌రీల‌తో చెల‌రేగాడు. ఒక మ్యాచ్ లో 18 ప‌రుగులు.. వేరొక మ్యాచ్ లో 33 ప‌రుగులు మాత్ర‌మే చేసినా ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. గ‌త కొంత‌కాలంగా లాంగ్ ఇన్నింగ్స్ ఆడ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న రిష‌బ్ ఫామ్ పై చాలానే విమ‌ర్శ‌లు ఉన్నా.. పేల‌వ‌మైన షాట్స్ తో దొరికిపోతున్నాడ‌ని సెల‌క్ట‌ర్లు అంటున్నా.. అత‌డు త‌న‌దైన ఎటాకింగ్ గేమ్ తో యూత్ కి కిక్కిస్తాడ‌న్న‌ది అంతే వాస్త‌వం.

అయితే అత‌డి ఆట‌కు బాలీవుడ్ భామ.. మిల్కీ అందాల ఊర్వ‌శి రౌతేలా ఫిదా అయిపోవ‌డ‌మే గాక ఏకంగా ల‌వ్ లో ప‌డిపోయింద‌నేది తాజా రిపోర్ట్. ఓవైపు వెస్టిండీస్ టీమ్ తో టీ20ల‌తో బిజీగా ఉన్న రిష‌బ్ టైమ్ దొరికితే చాలు అమ్మ‌డి చెంత వాలిపోతున్నాడ‌ట‌. మొన్న‌టికి మొన్న ఓ ఐదు న‌క్ష‌త్రాల హోట‌ల్లో ఊర్వ‌శి రౌతేలాతో డిన్న‌ర్ చేశాడ‌ని త‌న సాన్నిహిత్యం కోరుకుంటున్నాడ‌ని ఒక‌టే ప్ర‌చారం మోతెక్కి పోతోంది. మొన్న జ‌రిగిన మూడో టీ20 ముందు ఈ సీన్ లో ఈ కొత్త జంట దొరికి పోయింద‌ని చెబుతున్నారు.

ఊర్వ‌శి ఇంత‌కు ముందు హార్థిక్ ప‌టేల్ తోనూ చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేసింద‌ని మాట్లాడుకున్నారు. ఇంత‌లోనే రిష‌బ్ తో డిన్న‌ర్ డేట్ లో దొరికిపోవ‌డంతో ఎఫైర్ క‌హానీ వేడెక్కిస్తోంది. క్రికెట‌ర్ల‌తో బాలీవుడ్ భామ‌ల స్నేహాలు ఆల్వేస్ హాట్ టాపిక్. విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జోడీ ప్రేమాయ‌ణంతో పాటు ప్ర‌స్తుత‌ టీమిండియాలో అర‌డ‌జ‌ను పైగానే ఆట‌గాళ్లు క‌థానాయిక‌ల్ని ప్రేమించి పెళ్లాడి ర‌చ్చ చేసిన సంగ‌తిని విస్మ‌రించలేం. పాపం రిష‌బ్ ప‌సోడు.. ఇలా ఊర్వ‌శి ప్రేమ మ‌త్తు లో మునిగి కెరీర్ ని పోగొట్టుకోడు క‌దా! అంటూ మ‌రో కోణంలో అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. పాల‌నురుగు అందాల‌తో వేడెక్కించే ఊర్వ‌శి రౌతేలా హేట్ స్టోరి 4లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.