నాడు వైజాగ్ లో జగన్ కు.. నేడు రేణిగుంటలో చంద్రబాబుకు.. సేమ్ సీన్ రిపీట్!

Mon Mar 01 2021 12:07:43 GMT+0530 (IST)

Revenge ?: Vizag Airport to Jagan today .. Chandrababu in Renigunta today ..

ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఏదీ మరిచిపోవడం లేదు. తనకు ఎదురైన అవమానాలను వడ్డీతో సహా చంద్రబాబుకు తిరిగిచ్చేస్తున్నారు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. పాపం వృద్ధుడు అయిపోయాడని కూడా వదలడం లేదు.సేమ్ తనను అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే అవమానించాడో.. అలాగే బాబుకు చుక్కలు చూపిస్తున్నాడు.తాజాగా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన పెట్టుకున్నాడు. ఏకంగా 5వేల మంది టీడీపీ కార్యకర్తలతో ధర్నాకు నిర్ణయించారు. అసలే కరోనా టైం.. సెకండ్ వేవ్ మొదలైందని.. పైగా తిరుపతి ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను ఈసీ జారీ చేయడంతో పోలీసులు ఈ ధర్నాకు అనుమతి నిరాకరించారు. కీలక టీడీపీ నేతలందరినీ అరెస్ట్ చేసి పీఎస్ లకు తరలించారు.టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రేణిగుంట విమానాశ్రయానికి రాగా వారిని వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది.

చంద్రబాబు ఈ ఉదయం రేణిగుంట విమాశ్రయానికి రాగానే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కరోనా విస్తరణ నేపథ్యంలో అనుమతి నిరాకరించారు.

పోలీసులు అడ్డుకోవడంతో విమానాశ్రయంలోనే చంద్రబాబు బైటాయించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేలపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే బాబు కలవడానికి వచ్చిన రైల్వే కోడూర్ నేత నరసింహ ప్రసాద్ ను పోలీసులు తోసేశారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాను మీడియాతో మాట్లాడుతానన్న పోలీసులు చంద్రబాబును అనుమతించలేదు. నిబంధనలు అతిక్రమిస్తే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరిస్తూ చంద్రబాబుకు రేణిగుంట పోలీసులు నోటీసులు జారీ చేశారు.

పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు ఎయిర్ పోర్టులో నేలపై కూర్చొని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయం అక్రమం దారుణం అంటూ గింజుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు.

నాడు వైజాగ్ లోనూ నిరసన తెలుపడానికి వచ్చిన జగన్ కు ఇదే గతి పట్టిందని.. సేమ్ సీన్ తిరుపతి లో రిపీట్ అయ్యిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైనా ఇస్తే తిరిగిచ్చేయడం జగన్ కు అలవాటని.. లేకపోతే ‘లావైపోతాడంటూ’ సినిమాటిక్ డైలాగులతో చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో ఇచ్చిన షాక్ పై సెటైర్లు వేస్తున్నారు.