Begin typing your search above and press return to search.

నా పుట్టినిల్లు టీడీపీ.. మెట్టినిల్లు కాంగ్రెస్.. రేవంత్ ఆసక్తిక కామెట్స్

By:  Tupaki Desk   |   24 Sep 2022 6:56 AM GMT
నా పుట్టినిల్లు టీడీపీ.. మెట్టినిల్లు కాంగ్రెస్.. రేవంత్ ఆసక్తిక కామెట్స్
X
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన పుట్టినిల్లు టీడీపీ అని, మెట్టినిల్లు కాంగ్రెస్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నాడా..? అని కొందరు సెటైర్లు వేస్తున్నాడు. అంతేకాకుండా చంద్రబాబుతో తనను పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ఇప్పటికే కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో సొంత పార్టీలో దుమారం లేపాయి. దీంతో కాంగ్రెస్ లో మరోసారి అసమ్మతి బయటపడుతుందా..? అని కొందరు చర్చించుకుంటున్నారు. ఇంతకు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి..?

తెలంగాణలో రాజకీయం ఈమధ్య రంజుగా మారింది. త్రిముఖ పార్టీల మధ్య మాటల యుద్దం నిత్యం కొనసాగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటేనని బీజేపీ విమర్శిస్తుండగా.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి నాటకమాడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల మునుగోడు స్థానం ఖాళీ కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన విషయం తెలిసిందే ఆమె తరుపున రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారింది.

'చంద్రబాబునాయుడు ఒకప్పుడు కాంగ్రెస్లో కొనసాగారు.. ఆ తరువాత టీడీపీలోకి కోడలిలా వచ్చారు.. కానీ నేను టీడీపీ బిడ్డను.. కాంగ్రెస్ లోకి కోడలిలా వచ్చాను.. ఎప్పటికైనా నా పుట్టినిల్లు టీడీపీ.. మెట్టినిల్లు కాంగ్రెస్..' అని అన్నాడు. అంటే ఇప్పటికీ తాను టీడీపీ వ్యక్తినేనని అన్నట్లు కామెంట్స్ చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు తనను చంద్రబాబే కాంగ్రెస్లోకి పంపించారన్నట్లు మాట్లాడరని మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే తన మెట్టినిల్లు కాంగ్రెస్ అయినా.. పార్టీ గౌరవం నిలబెడుతానని రేవంత్ చెప్పుకొచ్చారు.

సాధారణంగానే రేవంత్ రెడ్డి పొలిటికల్ ను హీటెక్కించే వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈసారి చంద్రబాబుతో పోల్చడం మరింత ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు.

ఆయన పార్టీకి ద్రోహం చేయడానికే వచ్చారని కొందరు ఇప్పటికే విమర్శిస్తున్నారు. పార్టీని గాడిలోకి తెచ్చేబదులు తుంగలో తొక్కుతున్నారని కొందరు బహిరంగంగానే విమర్శించారు. ఈ తరుణంలో ఆయన మరోసారి విమర్శలకు కారణమయ్యారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.