Begin typing your search above and press return to search.

రకుల్ సినిమాకు సైన్ చేసినట్టా? సమంత సిరీస్ కు సంతకం పెట్టినట్లా? రేవంత్ ఫైర్

By:  Tupaki Desk   |   31 March 2023 7:24 PM GMT
రకుల్ సినిమాకు సైన్ చేసినట్టా? సమంత సిరీస్ కు సంతకం పెట్టినట్లా? రేవంత్ ఫైర్
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు కమ్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆయన తీవ్రంగా రియాక్టు అయ్యారు. తనపై కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం వేస్తానంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ మరింత తీవ్రంగా రియాక్టు అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఈడీ ఆఫీసుకు వచ్చిన రేవంత్.. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విచారణ చేయాలని కోరారు.

సీఐడీ విచారణ కాకుండా ఈడీ విచారణ చేయాలని.. ఎందుకంటే.. కొందరిని విచారించకుండా సీఐడీ వ్యవహరించే వీలుందన్న వ్యాఖ్య ఆయన చెప్పారు. పేపర్ లీక్ ఇష్యూలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. రూ.వంద కోట్లు ఇస్తే మంత్రి కేటీఆర్ ను ఎన్ని బూతులు అయినా తిట్టొచ్చా? అంటూ మండిపడిన రేవంత్.. ''తన పరువును రూ.వంద కోట్లు అని ఎలా నిర్దారించారు? కేటీఆర్ ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్లా? లేకపోతే సమంత సిరీస్ కు సంతకం పెట్టినట్టా? ధర నిర్ణయించి అగ్రిమెంట్ చేసుకోవటానికి? పబ్లిక్ డొమైన్ లో లేని సమాచారం కేటీఆర్ కు ఎలా వచ్చింది?'' అంటూ సూటిగా ప్రశ్నించారు.

''జగిత్యాల జిల్లాలో పరీక్ష రాసిన వారి సమాచారం కేటీఆర్ కు అందించిన వారు ఎవరు? కటాఫ్ మార్కుల గురించి పరీక్షలు రాసిన అభ్యర్థులకే తెలియదు. కేటీఆర్ కు ఈ విషయాలు ఎలా తెలిశాయి. సిట్ కొద్ది మందినే విచారిస్తుందన్న సమాచారం మాకుంది.

కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్పీ అధికారులందరిని విచారించాలి. 420, 120బి సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశాం. కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగుల్ని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు''అని మండిపడ్డారు.

పబ్లిక్ డోమైన్ లో లేని సమాచారం కేటీఆర్ కు ఎలా వచ్చిందని ప్రశ్నించిన కేటీఆర్.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది కేటీఆర్ కు ఎలా తెలుసు? పేపర్ దొంగలు ఏమైనా సమాచారం ఇచ్చారా? లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.

నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మీదా.. టీఎస్ పీఎస్సీ మెంబర్ల మీదా విచారించాలి'' అని డిమాండ్ చేశారు. అన్నీ బాగాున్నాయి కానీ.. ఏ మాత్రం సంబంధం లేని రకుల్.. సమంతలను ఈ ఎపిసోడ్ లోకి రేవంత్ ఎందుకు లాగినట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.