ఆరోపణల సవాళ్లు: మల్లారెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి

Tue May 04 2021 13:00:25 GMT+0530 (IST)

Revanth Reddy Vs Malla Reddy

ఈటల రాజేందర్ ను తెలంగాణ మంత్రి వర్గం నుంచి భూకబ్జా ఆరోపణలతో తొలగించడంతో ఇప్పుడు ఆ దుమారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించి ఆరోపణలు.. ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దీనిపై తీవ్ర ఆరోపనలు చేశారు. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్ మల్లారెడ్డిపై కబ్జా ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా  ఆయన చూపిస్తున్నారు.

 ఈ ఆరోపనలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డితో సవాల్ చేశారు. దమ్మున్న మగాడివైతే ఆరోపణలు రుజువు చేయి అని ఒక టీవీ డిబేట్ లో చర్చకు వచ్చారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. గుండ్లపోచంపల్లి సర్వే నంబర్ 658లో 7 ఎకరాల స్థలంలో మూడెకరాలు మంత్రి బావమరిదికి సంబంధించిందన్నారు. అదే ప్రాంతంలో మంత్రి మల్లారెడ్డి బావమరిదికి ఓ గెస్ట్ హౌస్ ఉందంటూ ఓ టీవీ చానెల్ లో ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి బయటపెట్టారు.

గుండ్ల పోచంపల్లిలో నాకు ఒక్క ఎకరం కూడా లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆ గెస్ట్ హౌస్ తన బావమరిదిది అని మల్లారెడ్డి ఒప్పుకున్నారు.

దీంతో ఈటల రాజేందర్ ను బలిపశువు చేశారని.. బఫర్ జోన్ లోనూ మల్లారెడ్డి కాలేజీ భవనాలు కట్టాడని ఆరోపించారు. వీరిద్దరి సవాళ్లు ప్రతిసవాళ్లతో టీవీ చానెల్ లో చర్చ వాడివేడిగా సాగింది.