Begin typing your search above and press return to search.

కేసీయార్ పై రేవంత్ అస్త్రం పనిచేస్తుందా ?

By:  Tupaki Desk   |   18 Oct 2021 12:30 PM GMT
కేసీయార్ పై రేవంత్ అస్త్రం పనిచేస్తుందా ?
X
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అస్త్రాన్ని రెడీ చేసుకుంటోంది. ఇంతకీ ఆ అస్త్రం ఏమిటంటే నిరుద్యోగం. కేసీయార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఉద్యోగాలు భర్తీ చేయలేదని, ఫలితంగా నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటినుండి గట్టిగా మాట్లాడుతునే ఉన్నది. ఇలాంటి నేపధ్యంలోనే వైఎస్సార్టీపీ పెట్టిన దగ్గర నుండి ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే షర్మిల  దీక్షలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత విషయానికి వస్తే హుజూరాబాద్ ఉపఎన్నికలో నిరుద్యోగాన్నే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా హైలైట్ చేయాలని డిసైడ్ అయ్యారట. నియోజకవర్గంలో 36 వేలమంది నిరుద్యోగులున్నారట. నియోజకవర్గంలోని నిరుద్యోగులే రేపటి ఎన్నికల్లో తమ అభ్యర్ధి బల్మూరి వెంకట్ కు మద్దతుగా నిలబడతారని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది.

ఇదే సమయంలో తెలంగాణా ఉద్యమం సమయంలో ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగం లాంటి అనేక అంశాలపై కేసీయార్ మాట్లాడిన మాటలు, చేసిన హామీలన్నింటినీ ఇపుడు కాంగ్రెస్ పార్టీ బయటకు తీయబోతోందట. అప్పట్లో ఉద్యోగాలు, నిరుద్యోగంపై కేసీయార్ వివిధ సందర్భాల్లో మాట్లాడిన ఆడియో, వీడియోలను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రదర్శించాలని ఇప్పటికే రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం.  

ఇది సరిపోదన్నట్లుగా వెంకట్ తరపున ఎన్ఎస యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలు కూడా నిరుద్యోగం అంశాన్నే బాగా హైలైట్ చేస్తు అన్నీ మండలాల్లోను ప్రచారం చేయాలని కూడా డిసైడ్ అయ్యింది. ఇదే అంశంతో షర్మిల కూడా నియోజకవర్గంలో రోడ్డుషోలు చేయబోతున్నట్లు సమాచారం. ఎలాగూ ఇప్పటికే నిరుద్యోగులతో షర్మిల  నామినేషన్లు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న ఈటల రాజేందర్ కూడా కమలనాదులతో కలిసి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తానికి అన్నీ వైపుల నుండి కేసీయార్+టీఆర్ఎస్ అభ్యర్ధిని ముట్టడించబోతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.