Begin typing your search above and press return to search.

నిజాలు చెప్పిన రేవంత్ రెడ్డి.. అంతా షాక్

By:  Tupaki Desk   |   12 Nov 2019 7:28 AM GMT
నిజాలు చెప్పిన రేవంత్ రెడ్డి.. అంతా షాక్
X
మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ రేవంత్ రెడ్డి పలు సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లో ఆరితేరిన ఈయన గెలుపు కోసం పడ్డా కష్టాల ను ఏకరువు పెట్టాడు. పార్టీల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రజల మనసును గెలుచు కోవడం లో వారి అభిమానాన్ని మాత్రం పొందడం లో విఫలమయ్యానని తాజాగా చెప్పుకొచ్చాడు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా లో పర్యటన లో ఉన్నారు. అక్కడ న్యూజెర్సీ లో ఎన్ఆర్ఐల తో తాజాగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కొడంగల్ అసెంబ్లీ స్థానం లో తాను ఓడిపోతాను అస్సలు అనుకో లేదని చెప్పుకొచ్చాడు. తన ప్రాంత ప్రజలు.. తను నమ్మిన వాళ్లు ఇలా ఓడిస్తారని భావించ లేదని నిర్వేదం వ్యక్తం చేశారు. అయితే మల్కాజిగిరి ఎంపీ గా కూడా తాను గెలుస్తానని కానీ ఊహించ లేదని రేవంత్ రెడ్డి చెపడ్డం విశేషం.

జయాప జయాలు మన చేతుల్లో లేవని రేవంత్ రెడ్డి ఉద్వేగం తో మాట్లాడారు. సమయం.. సందర్భాను సారం ప్రకృతి, కాలం స్పందిస్తుందని.. అలాంటి అద్భుతాలే మొన్నటి ఎన్నికల ఫలితాలుగా వచ్చాయని రేవంత్ రెడ్డి వేదాంతం మాట్లాడారు

ఇక తన ఓటమిని తాను పెద్ద గా భావించడం లేదని.. నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కవిత కూడా ఓడిపోయిందని రేవంత్ రెడ్డి తనను తాను తక్కువ చేసుకోకుండా మాట్లాడారు. కేసీఆర్ ఫ్యామిలీ కే ఓటమి ఎదురైనప్పుడు తను ఎంత అని చెప్పుకొచ్చాడు. అమెరికా లోని ఎన్ఆర్ఐ లతో రేవంత్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.