ఏపీలో పాఠశాలల రీఓపెన్.. పలు మార్పులు

Sun Nov 22 2020 17:20:30 GMT+0530 (IST)

Reopening of schools in AP .. Many changes

ఆంధ్రప్రదేశ్ లో చదువులు చక్కబెట్టేందుకు అక్కడి సర్కార్ రెడీ అయ్యింది. స్కూళ్లను పున: ప్రారంభించేందుకు షెడ్యూల్ లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది.రేపటి నుంచి 678 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కేవలం 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

ఇక రేపటి నుంచి పదోతరగతి విద్యార్థులకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తామని.. అలాగే 89వ తరగతుల విద్యార్థులకు రోజు మార్చి రోజు క్లాసులు జరుగుతాయని చెప్పారు.

ఇక 67వ తరగతి విద్యార్థులకు మాత్రం డిసెంబర్ 14 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.

ఇక సంక్రాంతి సెలవుల తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఖచ్చితంగా మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సూచించారు.