షర్మిలను చంపెదెవరు.. జగన్ తో లొల్లి ముందు పరిష్కరించుకో?

Sat Sep 24 2022 17:07:46 GMT+0530 (India Standard Time)

Renuka Chowdhury Comments on YS Sharmila

ఫైర్ బ్రాండ్ ఊగిపోయింది. వైఎస్ షర్మిలపై పడిపోయింది. షర్మిలను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటూ ప్రశ్నించింది. వైఎస్ఆర్ ను పంపిందే విజయమ్మ అని.. అలాంటప్పుడు కుట్ర ఎక్కడిదంటూ నిలదీసింది. రేణుక మాటలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఘాటు కౌంటర్లతో రెచ్చిపోయారు తెలంగాణ ఫైర్ బ్రాండ్  రేణుకా చౌదరి. ఒకప్పుడు వైఎస్ఆర్ అనుంగ శిష్యురాలిగా ఉన్న ఈమె ఇప్పుడు ఆమె కూతురుపై నోరుపారేసుకోవడమే హాట్ టాపిక్ గా మారింది. తాజాగా వైఎస్ షర్మిలను రేణుకా చౌదరి హేళన చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ షర్మిల తమాషా వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. "ఇదో సినిమా డైలాగ్. మిమ్మల్ని చంపడానికి ఎవరు ఆసక్తి కలిగి ఉన్నారు. చంపితే దాన్నుంచి  ఏమి పొందుతారు? అసలు నువ్వు ఎవరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చావు'' అని రేణుకా చౌదరి సూటిగా షర్మిలను కడిగిపారేశారు.  

ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి 'కమ్మరావతి'ని పాలించే వ్యక్తితో పనులు పరిష్కరించుకుని ఇక్కడికి రండి అని షర్మిలకు తన అన్నయ్య జగన్ తోనే పంచాయితీ అని రేణుకా దెప్పిపొడిచారు.   తన నగ్న చిత్రాలను మహిళలకు ఫోన్‌లో పంపిన వైసీపీ ఎంపీపై వార్తా ఛానళ్లు పదేపదే ప్రసారం చేసినా షర్మిల ఎందుకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆమె తప్పుబట్టారు. వైసీపీ ఎంపీలు ఇంత నీచ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని వైసీపీలోని ప్రజాప్రతినిధుల కొలువుగా కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు.

వైఎస్‌ఆర్ మరణం వెనుక కుట్ర ఉందని షర్మిల చేసిన ఆరోపణపై రేణుక  భారీ కౌంటర్ ఇచ్చారు. ఆరోజు ఉదయం వైఎస్‌ఆర్‌ను చాపర్‌లో పంపింది మీ తల్లి  విజయమ్మ అని గుర్తు చేశారు. "వైఎస్ఆర్ హెలికాప్టర్ ఎక్కినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఆయన పక్కనే ఉన్నారు. మరణానికి మరొకరిని ఎలా నిందిస్తారు"అని ఆమె ప్రశ్నించారు. "నిజానికి మేము ఇప్పటికీ వైఎస్ఆర్ మరణానికి సంతాపం తెలుపుతున్నాం. అయితే అతని స్వంత పిల్లలు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. వైఎస్‌ఆర్ జీవించి ఉన్నప్పుడు తన పిల్లలతో ఎవరితోనూ శాంతిగా ఉండకపోయి ఉండవచ్చు' అని రేణుకా ఎద్దేవా చేశారు.

వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదమని.. అప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయని ఎదురుగాలులు వచ్చాయని రేణుకా అన్నారు.    ఇది అకస్మాత్తుగా ప్రమాదం అని రేణుక స్పష్టం చేశారు. "ఆమెకు కుట్ర గురించి సమాచారం ఉంటే ఆమె దానిపై పోరాడాలి. కేసు పెట్టమని చెప్పాలి." అంటూ షర్మిలకు హితవు పలికారు.

తనకు ప్రాణభయం ఉందని షర్మిల ప్రకటనపై కూడా రేణుకా మండిపడ్డారు. "అలా అయితే మీ ఇంట్లో ఉండడం మంచిది. మీ ఇంటి నుండి కదిలి తుపాకీతో ఓటర్ల వద్దకు వెళ్లమని ఎవరూ మిమ్మల్ని అడగలేదు. మీ పాదయాత్రకు ప్రచారానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు పేదలకు భోజనం పెట్టడంతోపాటు ప్యాకెట్లలో డబ్బులు కూడా పంచుతున్నారు. మీరు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చారు'' అని రేణుకా నిలదీశారు.  

తెలంగాణలో రాజన్న రాజ్యం కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా ఆమె ఏమీ చేయలేదని రేణుక ప్రశ్నించారు. కేవలం ఒక సామాజికవర్గం ఓట్లను చీల్చడానికే ఆమె రాజకీయాల్లోకి వచ్చిందని రాజకీయాల్లో ఉన్న అందరికీ తెలుసు. ఆమె గెలవడానికి ఉద్దేశించిన నాయకురాలు కాదని ఓట్లను చీల్చగలదని స్పష్టం చేశారు.  'షర్మిలను ఏదో ఒక ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.  చౌకబారు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటు' అని విమర్శించారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.