Begin typing your search above and press return to search.

పబ్​ జీ మళ్లొస్తుంది.. ఈ సారి రిలయన్స్​ ముసుగుతో

By:  Tupaki Desk   |   26 Sep 2020 10:30 AM GMT
పబ్​ జీ మళ్లొస్తుంది.. ఈ సారి రిలయన్స్​ ముసుగుతో
X
భారతప్రభుత్వం నిషేధించిన పబ్​జీ గేమ్​ మళ్లీ అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. అయితే చైనా యాజమాన్యం చేతిలో ఉండటంతో ఈ గేమ్​ను భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే ప్రస్తుతం ఈ గేమ్​ను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్​ ఇండస్ట్రీ ముందుకు వచ్చినట్టు సమాచారం. రిలయన్స్ టెలికాం విభాగం జియోతో పబ్‌జీ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చాయని.. ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరు సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఏ రకంగా ఓప్పందం దీనికి సంబంధిన ఒప్పంద సాధ్యాసాధ్యాలను లీగల్ టీం పరిశీలిస్తోంది. ప్రధానంగా రెండు అంశాలపై దృష్టినట్టు సమాచారం. మొదటిది 50:50 వాటాలు, రెండవది నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్ కు ఆదాయాన్ని చెల్లించడం. పబ్‌జీ గేమ్​ను దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. చైనా యాప్​లో నిషేధంలో భాగంగా భారత్​ ఈ యాప్ ను నిషేధించింది. దీంతో బ్లూహోల్​ తన ప్రాంచైజీని ఉపసంహరించుకున్నది.

అయితే తెలివిగా రిలయెన్స్​ ఈ విషయంలో ముందడగు వేసింది. లాభాల్లో ఉన్న ఈ గేమ్​యాప్​ను తాను సొంతం చేసుకుంటే భారత్​లో ఇక యాప్​ను తిరిగి ప్రారంభించవచ్చని ప్లాన్​చేసింది. ఇందులో భాగంగా బ్లహోల్​ కంపెనీతో మంతనాలు జరుపుతున్నది. మరోవైపు ఈ గేమ్​పై భారత్​లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ గేమ్​ వల్ల ఇప్పటికే మనదేశంలో చాలామంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఈ గేమ్​ తీసేయడంతో పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా రిలయెన్స్​ యాజమన్యాం ముసుగులో ఈ గేమ్​ రాబోతున్నది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు.