Begin typing your search above and press return to search.

రూ.3 వేల కోట్ల రీఫండ్ 'ఎయిర్ లైన్స్'కు అసాధ్యమే..ప్రయాణికులకు అదొక్కటే అవకాశం

By:  Tupaki Desk   |   4 Aug 2020 9:50 AM GMT
రూ.3 వేల కోట్ల  రీఫండ్ ఎయిర్ లైన్స్కు అసాధ్యమే..ప్రయాణికులకు అదొక్కటే అవకాశం
X
కరోనాతో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా అన్నింటా సంక్షోభం తెలెత్తింది. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పలు ఎయిర్ లైన్స్ సంస్థలను నష్టాలు చుట్టుముట్టాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆర్థికంగా చితికి పోయాయి. మార్చి ఆఖరు వరకు విమాన రాకపోకలు సాగినా ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయాయి. వేలాది మంది టికెట్లు బుక్ చేసుకుని కరోనా కారణంగా తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో తీవ్రంగా దెబ్బతిన్న విమానయాన సంస్థలు, ఆ తర్వాత రాకపోకలు తగ్గించడంతో మరింత కష్టాల్లో పడ్డాయి. ఇప్పుడు ప్రయాణాలు నిలిచిపోయిన వారందరికీ ఎయిర్ లైన్స్ సంస్థలు క్యాష్ రీ ఫండ్ చేయాల్సి వస్తోంది. సుమారు రూ. 3000 కోట్లు వరకు చెల్లింపులు చేపట్టాల్సి ఉంది.

అంత పెద్ద మొత్తం రీ ఫండ్ చేయడానికి విమానయాన సంస్థలు నగదు కొరత ఎదుర్కొంటున్నాయి. ఇక ఇప్పట్లో క్యాష్ రీఫండ్ కి అవకాశం లేదని చెబుతున్నారు. ప్రయాణికులు తమ టికెట్ డబ్బుని భవిష్యత్ ప్రయాణాలకు వినియోగించుకోవడమే మేలని అంటున్నారు. దేశంలో లాక్ డౌన్ మార్చి 25న మొదలవగా.. అప్పటి నుంచి విమాన రాకపోకలను తగ్గిస్తూ వచ్చారు. వేలాది మంది ప్రయాణాలతో కరోనా బారిన పడే అవకాశం ఉందని భావించి తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. పరిస్థితులు సద్దుమణిగాక వెళ్లొచ్చని భావించారు. ఆ తర్వాత ప్రభుత్వం సర్వీస్ లపై కూడా ఆంక్షలు విధించింది.

ప్రత్యేక అనుమతులు, వందే భారత్ మిషన్ వంటి సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు విమానయాన సంస్థలకు వచ్చిన చిక్కల్లా ఒక్కసారిగా రూ.3000 వేల కోట్ల మేర ప్రయాణికులకు టికెట్ క్యాన్సిలేషన్ క్యాష్ రీఫండ్ చేయాల్సి రావడం. కరోనా కష్టాల్లో కూరుకుపోయిన సంస్థలకు ఆ చెల్లింపులు తలకు మించిన భారంగా మారాయి. అందరికీ ఒకేసారి చెల్లింపులు చేపట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా ప్రయాణికులకు వెంటనే రీ ఫండ్ చేయాల్సిందే.. అని ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇప్పటికే ప్రభుత్వం ఎయిర్ లైన్స్ సంస్థలతో చర్చలు జరిపి దాదాపు రూ. 1500 కోట్ల వరకూ రీఫండ్ చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణికులు తమ టికెట్ డబ్బును క్రెడిట్ షేల్ లో ఉంచుకోవడం లేదా టికెట్లు క్యాన్సల్ చేసుకుని ఆ మొత్తంతో భవిష్యత్ తేదీల్లో ప్రయాణాలు పెట్టుకోవడం మేలని సూచిస్తున్నారు.