శ్రీకాకుళం నుంచి మహిళా మంత్రి ఆమేనా...?

Thu Nov 25 2021 05:00:01 GMT+0530 (IST)

Reddy shanthi is a woman minister from Srikakulam

త్వరలోనే రాష్ట్రంలో మంత్రి వర్గంలో మార్పులు ఖాయమనే వాదన వినిపిస్తోంది. 2019 ఎన్నికల సమ యంలో.. వైసీపీ అధినేత.. సీఎం జగన్.. తన ప్రభుత్వంలో ఉండే మంత్రులను పూర్తిగా 90 శాతం వచ్చే రెండున్నరేళ్లలో పూర్తిగా మారుస్తానని చెప్పారు. దీని ప్రకారం.. ఈ నెల ఆఖరుతో.. మంత్రి వర్గానికి రెండున్నరేళ్లు పూర్తవుతాయి.ఈ నేపథ్యంలో 90 శాతం మంది మంత్రులను మారిస్తే.. ఎవరికి చోటు దక్కుతుంది..? అనేచర్చజోరుగా సాగుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన విషయాలు చూసుకుంటే.. ఇక్కడ నుంచి ఇద్దరు నాయకులు.. మంత్రులు గా ఉన్నారు.

వీరిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. మరొకరు..పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు ఉన్నారు. అయితే.. వచ్చే మార్పుకూర్పుల్లో వీరిద్దరినీ పక్కన పెడితే.. మరో ఇద్దరికి అవకాశం కల్పించాలి. వారిలో ఇప్పటికేస్పీకర్ తమ్మినేని సీతారాంకు సీటు ఖాయమైందని అంటున్నారు.

ఆయన గతంలోనే మంత్రి పదవిని ఆశించారని.. అయితే.. తర్వాత చూద్దాం.. అంటూ.. జగన్ హామీ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కుతుందని అంటున్నారు.

ఇదే సమయంలో మరో పదవిని.. మహిళకు కేటాయిస్తారని ప్రచారంలో ఉంది. ఇటీవల పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లిన సీఎం.. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. త్వరలోనే మీ అమ్మ ఎలివేట్ అవుతారు..! అంటూ.. జగన్ రెడ్డి శాంతి కుమార్తె.. పెళ్లికూతురుతో అన్నారని.. నాయకులు గుసగుసలాడుతున్నారు.

ఇక దీంతో .. మంత్రి వర్గంలోకి రెడ్డి శాంతిని తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల తొలి రోజు.. ఆమె సభలో మాట్లాడుతూ.. జగన్ ను ఆకాశానికి ఎత్తేసింది.

ఆయన మహిళలకు చేస్తున్న పథకాలు.. కార్యక్రమాల గురించి ప్రధానంగా కొనియాడింది. ఈ సందర్భంగానే తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి.. అసెంబ్లీ వరకు తీసుకువచ్చారని.. ఆయనకు రుణపడి ఉంటానని.. చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో.. జగన్ కనుసన్నల్లో ఎలాంటి బాధ్యత అప్పగించినా.. తనలాంటి వాళ్లు చాలా మంది ముందుకు వస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిని బట్టి రెడ్డి శాంతికి మంత్రివర్గంలో సీటు ఖరారైందనే అంటున్నారు పరిశీలకులు.