డబుల్ ఈగిల్ జస్ట్.. రూ.142 కోట్లు

Thu Jun 10 2021 05:00:01 GMT+0530 (IST)

Record price double eagle Rs 142 crore

తాజాగా ఒక అరుదైన బంగారు నాణెన్ని వేలం వేస్తే.. ఊహించని ధర పలికింది. దీంతో ఇప్పుడు అందరి చూపు దాని మీదనే. అమెరికా బంగారు నాణెం డబుల్ ఈగిల్ గురించి తెలుసు కదా? ఇప్పుడీ నాణెన్ని వేలం వేస్తే.. ఏకంగా రూ.142 కోట్లు పలికి రికార్డుల్ని బద్ధలు కొట్టింది. ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జ్ మన్ ఈ నాణెన్ని వేలం వేశారు. ఇంత భారీ ధర పలికిన ఈ నాణెం స్పెషాలిటీ ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే..1933లో అమెరికాలో డబుల్ ఈగిల్ తో ఇరవై నాణెల్ని తయారు చేశారు. అప్పుడున్న తీవ్ర ఆర్థిక మాంద్యాన్ని పరిగణలోకి తీసుకున్న నాటి అమెరికా అధ్యక్షుడు రూజ్ వెల్ట్.. ఈ డబుల్ ఈగిల్ నాణెల్ని కరిగించి వేయాలని.. వీటిని చెలామణిలోకి తీసుకురావొద్దని ఆదేశాలుజారీ చేశారు.

అయితే.. ఆయన ఆదేశాలు జారీ అయ్యే లోపు రెండు నాణెలు బయటకు వచ్చాయి. అలా వచ్చిన దానిలో ఒకటి తాజాగా వేలానికి వచ్చింది.ఈ అరుదైన నాణెం ఒక వైపున లేడీ లిబర్టీ ఉండగా.. రెండో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మ ముద్రించి ఉంటుంది. తాజాగా ఈ నాణెంను వేలం వేస్తే.. రూ.142 కోట్ల భారీ మొత్తం పలకటంతో ప్రపంచమంతా ఇప్పుడీ నాణెం గురించి ఆసక్తిగా చూసే పరిస్థితి.