Begin typing your search above and press return to search.

భార‌త్‌ లో భానుడి ప్ర‌చండం: నిప్పుల‌కొలిమిలా రాజ‌స్థాన్‌

By:  Tupaki Desk   |   27 May 2020 12:10 PM GMT
భార‌త్‌ లో భానుడి ప్ర‌చండం: నిప్పుల‌కొలిమిలా రాజ‌స్థాన్‌
X
భారత‌దేశం‌లో భానుడి భ‌గ‌భ‌గ‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. భానుడి ప్ర‌చండానికి ప్ర‌జ‌లు త‌ట్టుకోలేక‌పోతున్నారు. దేశ‌మంతా ఇదే వాతావ‌ర‌ణం ఉంది. నిప్పుల కొలిమిలా భార‌త‌దేశం మండుతోంది. దీని ధాటికి త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్‌లు ఆశ్ర‌యిస్తున్నారు. మే రెండో వారం నుంచి ఉష్ణోగ్ర‌త్త‌లు పెర‌గ‌డం ప్రారంభ‌మ‌య్యాయి. ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది.

అధిక ఉష్ణోగ్ర‌త్త‌లు ఉత్తర భార‌త‌దేశంలో న‌మోద‌వుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ క్ర‌మంలోనే రాజస్థాన్ రాష్ట్రంలోని చురులో ఏకంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోద‌య్యింది. ఈ విష‌యాన్ని భారత వాతావరణ శాఖ ప్ర‌క‌టించింది. పదేళ్లలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేన‌ని స్ప‌ష్టం చేసింది. 2010 మే 19న ఈ ఉష్ణోగ్రత నమోదు కాగా మళ్లీ 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం ఇదే ప్రథమమ‌ని ఆ శాఖ పేర్కొంది.

రాజ‌స్థాన్‌లో ఎడారి ప్రాంతం ఉండ‌డంతో ఉష్ణోగ్ర‌త్త‌లు అధికంగా న‌మోదు కావ‌డానికి కార‌ణంగా వాతావ‌ర‌ణ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇక మ‌ధ్య‌ప్ర‌‌దేశ్ ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. ఎండ‌లు దంచికొడుతుండ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ఇళ్ల‌ల్లో ఉండ‌లేక‌పోతున్నారు. ఏసీలు, ఫ్యాన్లు, కూల‌ర్ల కింద కూర్చుంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే ప‌రిస్థితి ఉంది. తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌లో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త్త 43 నుంచి 44 మ‌ధ్య ఉంటోంది. వ‌డ‌గాల్పులు తీవ్రంగా వీస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడుతున్నారు. ఇక ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని రామ‌గుండం నిప్పుల‌కొలిమి ఉన్న‌ట్టు ఉంది. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో కూడా ఎండ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఏపీలోని గుంటూరు, క‌ర్నూలు, అనంత‌పురములో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త్త‌లు భారీగా న‌మోద‌వుతున్నాయి.