రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ హత్య.. బీజేపీ నేతకు బిగిసిన ఉచ్చు

Sat Sep 24 2022 15:30:31 GMT+0530 (India Standard Time)

Receptionist Murder in Resort of BJP Leader

ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్ కిత్ ఆర్యకు చెందిన ప్రైవేట్ రిసార్ట్ లో అదృశ్యమైన అందమైన రిసెప్షనిస్ట్ (19) విగతజీవిగా పడి ఉండడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడు బీజేపీ నేత కుమారుడికి సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపించడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.యువతి హత్య కేసు దర్యాప్తు కోసం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పుల్ కిత్ ఆర్య సహా ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

19 ఏళ్ల యువతి హత్యకు రిసార్ట్ యజమానే కారణమని ప్రాథమికంగా వెల్లడైంది. అతడితోపాటు రిసార్ట్ లో పనిచేస్తున్న మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరాఖండ్ హరిద్వార్ కు చెందిన వినోద్ ఆర్య అనే బీజేపీ నేతకు పౌరీ జిల్లాలో ఓ రిసార్ట్ ఉంది. అందులో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి గత కొంతకాలంగా కనిపించకుండా పోయింది.  

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ యువతిని బీజేపీ నేత కుమారుడు రిసార్ట్ యజమానిగా ఉన్న పులకిత్ ఆర్య మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ లు కలిపి హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు.

మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. నిందితులను కోర్టులో హాజరు పరుచగా.. వారికి 14 రోజుల కస్టడీ విధించారు. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన రిసార్ట్ ను శుక్రవారం రాత్రి బుల్డోజర్లతో కూల్చివేయించింది. నీచమైన నేరానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం ధామి స్ఫష్టం చేశారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.