Begin typing your search above and press return to search.

రాహుల్ లో పెను మార్పుల‌కు కార‌ణం ఇదే!

By:  Tupaki Desk   |   24 July 2018 1:30 AM GMT
రాహుల్ లో పెను మార్పుల‌కు కార‌ణం ఇదే!
X
ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పై గ‌త నాలుగేళ్లుగా వ‌స్తోన్న విమ‌ర్శ‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.130 ఏళ్ల ఘ‌న చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడికి `ప‌ప్పు`ఇని ప్ర‌తిప‌క్షాలు బిరుదునిచ్చాయి. రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థి `మొద్ద‌బ్బాయ్` అంటూ ఎద్దేవా చేశాయి. ప్ర‌త్య‌ర్థిని ఢీకొట్టే సామ‌ర్థ్యం లేని `యువ‌నేత‌` అంటూ క‌మ‌ల‌నాథుల విమ‌ర్శించారు. మోదీని ఢీకొట్టే స్థాయి రాహుల్ కు లేదంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ నాయ‌క‌త్వం చూసి....క‌మ‌ల‌నాథులు న‌వ్వుకుంటున్న వైనం....అందుకు త‌గ్గ‌ట్లుగానే ప‌స‌లేని ప్ర‌సంగాల‌తో ముందుకు పోతోన్న రాహుల్.....మ‌రోవైపు 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న త‌రుణం....త‌మ‌కు తిరుగులేదంటూ బీజేపీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తూ....కాంగ్రెస్ ను అప‌హాస్యం చేస్తున్న స‌మ‌యం....ఇటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌న్నింటినీ....ఒకే ఒక్క ప్ర‌సంగంతో మార్చేశారు రాహుల్ గాంధీ. లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత రాహుల్ ప్ర‌సంగించిన తీరుకు క‌మ‌ల నాధుల‌లో క‌ల‌వరం మొద‌లైంది. మోదీకి హ‌గ్ ఇచ్చి షాకిచ్చిన రాహుల్...త‌న స్పీచ్ తో యావత్ భార‌త‌దేశాన్ని ఆక‌ట్టుకున్నారు. నాలుగేళ్లుగా చూస్తోన్న రాహుల్...ఆ ప్ర‌సంగం చేస్తోన్న రాహుల్ ఒక‌రేనా అన్నంత‌గా మార్పు వ‌చ్చిందంటే అతిశ‌యోక్తి కాదు.

అయితే, రాహుల్ పొలిటిక‌ల్ మేకోవ‌ర్ వెనుక ఎంతో శ్ర‌మ దాగి ఉంద‌ట‌. స‌రికొత్త బాడీ లాంగ్వేజ్ తో తూటాల్లాంటి మాట‌ల‌తో ...భిన్న హావ‌భావాల‌తో రాహుల్ ప్ర‌సంగించ‌డం వెనుక ఎంతో క‌స‌ర‌త్తు ఉంద‌ట‌.నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టినా...ఎన్ని ప్ర‌సంగాలు చేసినా రాహుల్ కు పేరు రాలేదు. దీంతో, రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాహుల్ ను బ‌ల‌మైన నేత‌గా ఎక్స్ పోజ్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం న‌డుం బిగించింది. దీంతో, బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివ‌రీ వ‌ర‌కు రాహుల్ ప‌క్కా హోమ్ వ‌ర్క్ చేశారు. అందువ‌ల్లే, 2014కు ముందు....మోదీ ప్ర‌సంగించిన త‌ర‌హాలోనే లోక్ స‌భ‌లో రాహుల్ కూడా అగ్రెసివ్ గా స్పీచ్ ఇచ్చారు. త‌న‌ను ఎద్దేవా చేస్తోన్న ప‌ప్పును కూడా మోదీపై దాడికి వాడుకున్నారు.మోదీని ఢీకొట్టే నాయ‌కుడిని తానేన‌ని రాహుల్ నిరూపించారు. ఎక్క‌డా తొణుకూ బెణుకూ లేకుండా ప్ర‌సంగించి....మోదీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో రాహుల్ స‌క్సెస్ అయ్యారు. దాంతోపాటు, మోదీ త‌ర‌హాలోనే ఛ‌లోక్తులు విసురుతూ....బీజేపీపై ఎదురుదాడి చేశారు. దాంతోపాటు తాను హిందువున‌నే విష‌యాన్ని ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా బ‌ల్ల‌గుద్ది చెప్ప‌డం ద్వారా...గ‌తంలో త‌న‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌కు రాహుల్ చెక్ పెట్టారు. రాహుల్ ప్ర‌సంగంతో షాక్ లో ఉన్న మోదీకి ....హ‌గ్ ఇవ్వ‌డం ద్వారా రాహుల్ మ‌రో షాకిచ్చారు. ఈ త‌రహా ప‌రిణామాన్ని ఊహించని మోదీ క్ష‌ణంపాటు నిష్టేచ్చుడ‌య్యారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. రాహుల్ ఊపు చూస్తుంటూ మున్ముందు కూడా ఇదే త‌ర‌హాలో ప్రొసీడ్ అయ్యేట్లు క‌నిపిస్తోంది. అయితే, రాహుల్ లోని వాడీ...వేదీ...కేవ‌లం ఒక ప్ర‌సంగానికే ప‌రిమితం అవుతుందా...లేదంటే....ప్ర‌ధాని పీఠం ద‌క్కేవ‌ర‌కు కొన‌సాగుతుందా అన్న సంగ‌తి తేలాలంటే మ‌రి కొంత కాలం వేచి చూడాలి.