పవన్ విదేశాలు వెళ్లడం వెనుక అసలు కారణం ఇదేనా?

Sat Sep 24 2022 13:40:02 GMT+0530 (India Standard Time)

Reason Behind Pawan Going Abroad?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో ఉండటం లేదా? ఆయన విదేశాల్లో నివసిస్తున్నారా అంటే అవుననే గాసిప్స్ వినిపిస్తున్నాయి. పవన్ కు హైదరాబాద్‌లోనూ మంగళగిరి సమీపంలో కాజ గ్రామ వద్ద సొంత ఇళ్లు ఉన్నాయి. విజయవాడ పటమట లంకలో ఒక నివాసాన్ని కూడా అద్దెకు తీసుకున్నారు. అయితే ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో కానీ విజయవాడలో కానీ మంగళగిరిలో కానీ నివసించడం లేదని సమాచారం. ప్రస్తుతం ఈ గాసిప్ హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటివరకు పవన్ హైదరాబాద్‌లోనే ఉంటూ వస్తున్నారు. సినిమా షూటింగులకు హాజరు కావాల్సి ఉండటంతో ఆయన అక్కడే ఉంటున్నారు. ఇక పార్టీ సమావేశాలు సభల కోసం ఏపీకి వస్తున్నారు. వచ్చినప్పుడు రెండు మూడు రోజులు మంగళగిరిలోని పార్టీ ఆఫీసులోనే ఉంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ విదేశాల్లో ఉంటున్నారని గాసిప్ చర్చనీయాంశమైంది.

మరికొంతమంది మాత్రం జనసేన పార్టీకి విరాళాలు సేకరించడానికి ఆయన విదేశాల్లో పర్యటిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికాలోని టెక్సాస్ లో ఉన్నట్టు సమాచారం. ఇటీవల మంగళగిరిలో జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులతో మాట్లాడారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 45-67 సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు.

ఇక అప్పటి నుంచి పవన్ విదేశాల్లో ఉన్నారని అంటున్నారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా రష్యన్ యువతి. గతంలో కొన్నిసార్లు తన సతీమణితో కలిసి రష్యాకు వెళ్లి కొన్నాళ్లు ఉండి వచ్చారు. ఇప్పుడు మాత్రం రష్యా వెళ్లలేదని అమెరికాలో ఉన్నారని అంటున్నారు.

వాస్తవానికి పవన్ కల్యాణ్ అక్టోబర్ 5 దసరా పండుగ నుంచి ప్రజల్లోకి వస్తానని ప్రకటించారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి జగన్ ప్రభుత్వ తప్పులను వైఫల్యాలను చీల్చిచెండాడుతానని తెలిపారు. అయితే పవన్ బస్సు యాత్ర కొన్నాళ్లు వాయిదా పడింది. స్వయంగా పవనే ఈ విషయాన్ని ఇటీవల మంగళగిరి వచ్చినప్పుడు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలవారీగా నియోజకవర్గాల బలోపేతంపై దృష్టి సారిస్తున్నామన్నారు. నియోజకవర్గాల సమీక్ష చేపడతానన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై చేయడంపై దృష్టి పెట్టానన్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే తన బస్సు యాత్ర తప్పకుండా ఉంటుందని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు వచ్చే ఎన్నికల్లో పార్టీని నడిపించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఈ క్రమంలోనే ఆయన విదేశాల్లో పర్యటిస్తున్నారని సమాచారం. అయితే అమెరికాలో టెక్సాస్‌లో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంలో పవన్ సన్నిహితులకు పార్టీ వర్గాలకు సమాచారం లేకపోవడం గమనార్హం.

అయితే ఒకటి రెండు రోజుల్లో పవన్ తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. లేదంటే మరికొద్ది రోజులు విదేశంలోనే ఉండొచ్చని చెబుతున్నారు.

అయితే ఒక్కటి మాత్రం నిజమేనంటున్నారు. పవన్ విదేశాల్లో ఉన్నారని చెబుతున్నారు. లేదంటే ఈ గాసిప్స్‌ను జనసేన పార్టీ కార్యాలయం ఖండించి ఉండేదని అంటున్నారు. ఇప్పటివరకు ఖండించలేదు కాబట్టి పవన్ విదేశీ పర్యటన నిజమేనని చెబుతున్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.