Begin typing your search above and press return to search.

మోడీ సీఎంలతో ఎందుకు మీటింగ్ పెడుతున్నాడో ఎవరికైనా అర్థం అవుతోందా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 4:15 AM GMT
మోడీ సీఎంలతో ఎందుకు మీటింగ్ పెడుతున్నాడో ఎవరికైనా అర్థం అవుతోందా?
X
మోడీ 15 రోజులకు ఒకసారి రాష్ట్రాల సీఎంలతో మీటింగ్ అంటున్నాడు. వాళ్లు చెప్పింది వింటాడు. వాళ్లు ఏమైనా అడిగితే ఉలుకు పలుకు ఉండదు. దీంతో ఎందుకు ఈ దండగ మీటింగ్ లని సీఎంలు వాపోతున్నారు. అడిగితే పలకనప్పుడు సీఎంలు కూడా పీఎం మీటింగ్ కు హాజరు కాకుండా ఉంటే మంచిది కదా అని ఆలోచిస్తున్నారట..

ప్రధాని నిర్వహించే సమావేశాలకు హాజరయ్యే బదులు బ్యాన్ చేసి నిరసన తెలిపితే సరిపోతుంది కదా అని పలువురు సీఎంలు అంతర్మథనం చెందుతున్నారు. మేము ఏమి అడిగినా ఇవ్వడం లేదు కదా.. ఏదో మీడియా కోసం ఫొటోలు, వీడియోల తీసి హాంగామా చేస్తున్నాడు తప్పితే ఏమైనా ఇదంతా వృథా ప్రయాస అన్న అభిప్రాయం సీఎంలలో ఉందట..

పీఎం మోడీ.. కరోనాతో కుదేలైన రాష్ట్రాలకు సాయం చేయడంపై మాత్రం నోరు మెదపకపోవడం ఆయా రాష్ట్రాలకు మింగుడు పడడం లేదు. నిజంగా రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకున్నాడా? అటువంటప్పుడు ఇలాంటి సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు.

నిజానికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా ఏకస్వామ్యంలో కేంద్రానిదే పెత్తనం నడుస్తోంది. రాష్ట్రాలు డమ్మీ అయిపోతున్నాయి. బీజేపీ సర్కార్ అంతా జాతీయ విధానాలు చేస్తూ రాష్ట్రాలు, నిధులు.. విధులు లేకుండా చేస్తున్నారన్న అపవాదు ఉంది. ఈ క్రమంలోనే మీడియా ఫోకస్ కోసం ప్రధాని మోడీ.. సీఎంలతో మీటింగ్ పెడుతున్నాడనే చర్చ ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది.