Begin typing your search above and press return to search.

ఆ ఎంపీలు కేసుల కోసమే బీజేపీలో చేరారా?

By:  Tupaki Desk   |   23 Feb 2020 1:30 AM GMT
ఆ ఎంపీలు కేసుల కోసమే బీజేపీలో చేరారా?
X
పూర్వ పార్టీలో ఉండగా బీజేపీతో సంబంధాలు తెగాయి. రాజకీయ పరిణామాలు మారాయి. వారికి రాజకీయంగా.. వ్యక్తిగతంగా చిక్కులు వచ్చిపడుతున్నాయి.. చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి.. కేంద్ర సంస్థల తమ వ్యాపారాలపై దాడులు చేస్తున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఉన్న సీఎం రమేశ్ - సుజనా చౌదరి - టీజీ వెంకటేశ్ - కనకమేడల రవీంద్రకుమార్ అకస్మాత్తుగా బీజేపీలో చేరిపోయారు. ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. అయితే బీజేపీలో చేరిన కూడా వారికి కష్టాలు తప్పడం లేదు. ఇప్పుడు వరుసగా వారికి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు సీఎం రమేశ్ - సుజనా చౌదరి - టీజీ వెంకటేశ్. వీరు వ్యాపారవేత్తలుగా కొనసాగుతున్నారు. ఆ క్రమంలోనే తెలుగుదేశానికి ఆర్థికంగా సహకరిస్తూ చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటున్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబు వారికి రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. అయితే రాష్ట్రంలో మారిన రాజకీయాలతో వారు చివరకు బీజేపీలోకి వెళ్లారు. అయితే బీజేపీలో చేరిన సమయంలో వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను చూసి చేరామని చెప్పారు. పైకి ఆ విధంగా చెప్పిన లోపల మాత్రం తమ వ్యక్తిగత పనుల కోసం చేరారని అందరికీ తెలుస్తోంది.

వారు వ్యాపార పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీలోకి చేరక ముందే టీజీ వెంకటేశ్ - సీఎం రమేశ్ ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. వారిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అనంతరం సుజనా చౌదరికి కూడా అవే ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగుదేశం పార్టీ బీజేపీ నుంచి దూరమైనప్పటి నుంచి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. చంద్రబాబు లక్ష్యంగా తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని భావించిన వారు ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. టీడీపీని వీడి బీజేపీలో చేరితో తమకు అలాంటి బాధలు ఉండవని భావించారు. పైగా కేసుల నుంచి బయటపడవచ్చనే ఉద్దేశంతో బీజేపీలోకి జంప్ అయినట్లు తెలుస్తోంది.

అయితే వారు చేరినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కనీసం రాష్ట్రంలో బీజేపీ ఎంపీలుగా పర్యటించినట్టు కనిపించలేదు. ఈ నేపథ్యంలో కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి పార్టీలో చేరారని భావించిన బీజేపీ పెద్దలు.. వారికి బుద్ధి చెప్పేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఆ ఎంపీలపై కేసులు నమోదవుతున్నాయని - బ్యాంకుల రూపంలో కష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం సుజనా చౌదరికి బ్యాంక్ షాకిచ్చింది. రుణం ఎగ్గొట్టడంతో అతడి ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించడంతో పాటు తమను మోసం చేసిన సుజనాపై విచారణ చేపట్టాలంటూ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఇప్పటికైనా ఆ ఎంపీలు దారిలోకి రాకుంటే సీబీఐ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికైనా పార్టీ పటిష్టతకు పని చేయండి. లేదంటే కేంద్ర సంస్థలు తమ పని చేసుకుంటూ వెళ్తాయని పరోక్షంగా బీజేపీ అధిష్టానం హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.