Begin typing your search above and press return to search.

రెడ్ కలర్ టు ఎల్లో:భారత్‌ కు దగ్గరగా..ట్రంప్ నెక్ టై కథ తెలుసా?

By:  Tupaki Desk   |   24 Feb 2020 5:26 PM GMT
రెడ్ కలర్ టు ఎల్లో:భారత్‌ కు దగ్గరగా..ట్రంప్ నెక్ టై కథ తెలుసా?
X
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్‌ లో అడుగు పెట్టారు. అహ్మదాబాద్‌ లో దిగగానే సబర్మతి ఆశ్రమంలో మహాత్ముడికి నివాళులు అర్పించి - ఆ తర్వాత రోడ్డు షోగా మోతేరా స్టేడియంలో ప్రధాని మోడీతో కలిసి ప్రసంగించారు. ఆ తర్వాత తాజ్ మహల్ - అక్కడి నుండి ఢిల్లీకి చేరుకున్నారు. ట్రంప్‌ తో పాటు సతీమణి మెలానియా - కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చారు. ట్రంప్ సాధారణంగా ఎరుపు రంగు లేదా బ్లూ రంగు టైలో కనిపిస్తారు. అహ్మదాబాద్‌ లో ల్యాండ్ కాగానే ఆయన మెడలో పసుపు రంగులోని టై కనిపించింది.

ట్రంప్ అమెరికాలో ఎయిర్‌ ఫోర్స్ వన్‌ లో బయలుదేరడానికి ముందు క్రిస్ప్ వైట్ షర్ట్ - రాయిల్ బ్లూ ప్యాంట్స్ - లాంగ్ బ్లూ కోట్ - ఎరుపు రంగు టైలో కనిపించారు. అహ్మదాబాద్‌ లో దిగే సమయంలో టై పసుపు రంగులో ఉంది. అయితే అగ్రరాజ్యాధిపతి తన టై ద్వారా భారత్‌ కు - ప్రధాని మోడీకి - యావత్ ప్రపంచానికి ఓ సందేశం ఇచ్చారనేది నెటిజన్ల అభిప్రాయం.

అమెరికన్ సంప్రదాయం ప్రకారం రెడ్ కలర్ నెక్ టై కట్టుకుంటే అత్యంత పవర్‌ ఫుల్ అని సంకేతాలు ఇచ్చినట్లు. అందుకే అమెరికాలో దానిని ధరించారని చెబుతున్నారు. శాంతి సందేశాన్ని వ్యాప్తి చేసే సమయంలో - నిజమైన శ్రేయోభిలాషులను కలుసుకునే సమయంలో పసుపు రంగు నెక్ టై కట్టుకోవడం అమెరికన్లకు అలవాటుగా చెబుతారు. భారత్‌లో అడుగిడే సమయంలో ట్రంప్ అదే చేశారని చెబుతున్నారు.

దీంతో పాటు ప్రపంచ దేశాల్లో హిందువులు మెజార్టీ కలిగిన దేశం భారతదేశం. హిందువులు పసుపు రంగుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. తీవ్రవాదంతో పోరాడే శాంతి కాముకులు అన్న సందేశం ఇచ్చేందుకు కూడా పసుపు రంగు నెక్ టైతో వచ్చారని చెబుతున్నారు. ట్రంప్ ఎన్నో ప్రాంతాలకు వెళ్లారు. ఎందరితోనో కలిశారు. తన నెక్ టై ద్వారా తాను కలుసుకునే వారికి తన అభిమతాన్ని చాటడం కూడా ట్రంప్‌కు అలవాటుగా చెబుతారు. ఈ ప్రకారం ట్రంప్ భారత్‌ ను తన శ్రేయోభిలాషిగా చూస్తున్నారని భావించవచ్చునని అంటున్నారు.