ఏపీలో అధికారం ఈ పార్టీదే.. బాంబు పేల్చిన మాజీ ఎంపీ

Sat Oct 01 2022 10:04:04 GMT+0530 (India Standard Time)

Rayapati Sambasivarao About AP Political Party

2024 ఎన్నికలకు సంబంధించి ఏపీలో రాజకీయ కాక మామూలుగా లేదు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షం వరకు అన్ని పార్టీ లూ.. గెలుపు గుర్రం ఎక్కడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఎవరికివారు.. గెలుపు మాదంటే.. మాదేనని.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చెప్పుకొంటున్నారు. ఇక సర్వేలు.. సమాచారం అంటూ.. వైసీపీ నేతలు హడావుడి పెంచారు. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా.. త్వరలోనే పాదయాత్ర(లోకేష్) బస్సు యాత్ర(చంద్రబాబు) అంటూ.. హడావుడి పెంచుతోంది. ఇక ఇప్పటికే నాయకులను రంగంలోకి దింపి.. గెలిచే స్థానాలపై అంచనా వేసుకుంటున్నారు.ఇక ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ.. సీనియర్ రాజకీయ నాయకుడు.. రాయపాటి సాంబశివరావు.. బాంబు పేల్చారు. రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా తలపండిన నాయకుడిగా పేరు న్న రాయపాటి.. దాదాపు అన్నీ ఆలోచించే చెబుతారు. ఈ క్రమంలో ఆయనకు విశ్వసనీయత మెండుగానేఉంది.

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసారావు పేట నియోజకవరర్గంనుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. 2014లో మాత్రం ఆయన విజయం అందుకున్నారు. కొన్నాళ్లుగా.. అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాయపాటి తాజాగా.. తన సర్వేపేరుతో.. మళ్లీ ఏపీలో తనదైన కాక పుట్టించారు.

ఇంతకీ రాయపాటి చెప్పిన సర్వే.. ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందన్నారు. అ2024 ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయమని.. ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 125 స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్న రాయపాటి.. ప్రజలు మార్పును .. కోరుకుంటున్నారని అన్నారు. ఈ మార్పు అభివృద్ది కోసమేనని ఆయన చెప్పారు. అభివృద్ధి నాయకుడిగా... విజన్ ఉన్న నాయకుడిగా.. చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని.. ఆయన వైపే ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. టీడీపీదె గెలుపని రాయపాటి చెప్పడం గమనార్హం. అయితే.. పొత్తుల విషయంలో మాత్రం.. చంద్రబాబుదే అంతిమ నిర్ణయంగా ఆయన పేర్కొన్నారు. ఇక కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా.. వద్దా.. అనే విషయం ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. తనకు టికెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబుకుపూర్తి స్వేచ్ఛ ఉందని.. ఆయన నిర్ణయం ఎలా ఉన్నా.. అంగీకరిస్తానన్నారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.