రాములోరి కోసం 28 ఏళ్లుగా బ్రహ్మచర్యం .. కల నేరవేరింది కానీ !

Wed Aug 05 2020 19:30:08 GMT+0530 (IST)

Celibacy for 28 years for Lord Ram .. dream come true, but!

అయోధ్య తో పాటుగా దేశం మొత్తం రామనామస్మరణతో మారుమోగింది. కొన్ని దశాబ్దాలుగా హిందువులు ఎదురుచూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. రామ మందిరానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 5 గోపురాలతో 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. పండితులు సూచించినట్లుగా మధ్యాహ్నం 12.44కి మొదలై... 12.45 సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అదే సమయంలో పునాది రాయి వేశారు మోదీ.ఈ క్రమంలో భోపాల్ కి చెందిన కరసేవకుడు రవీంద్ర గుప్తా 28 సంవత్సరాల క్రితం రామాలయ నిర్మాణాన్ని కాంక్షిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య లో ఆ రాముడి ఆలయం నిర్మాణం ప్రారంభమయ్యేంత వరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు రవీంద్ర వయసు 50 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఆయన వివాహం గురించి ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన రవీంద్ర గుప్తాను భోజ్పాలి బాబా అని కూడా పిలుస్తారు.

అతను ఇప్పటివరకు నాలుగుసార్లు నర్మద ప్రదక్షిణ చేశారు. రవీంద్ర గుప్తా 22 సంవత్సరాల వయసులో అయోధ్యకు చేరుకున్నారు. ప్రస్తుతం రవీంద్ర గుప్తా బేతుల్లో ఉంటున్నారు. రామాలయ భూమి పూజ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ .. తాను ఆగస్టు 5న శ్రీరామునికి పూజ చేస్తానని తెలిపారు. ఇక ఈ నా జీవితం ఆ రాముడికి తల్లి నర్మద పూజల కోసమే కేటాయిస్తానని అన్నారు. తాను 1992లో కరసేవ కోసం వెళ్లినప్పుడు తనకు 22 సంవత్సరాలని రవీంద్ర గుప్తా తెలిపారు.