‘రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ఆటగాడు అందులో ఏ డౌట్ లేదు.. అతడికి టెస్ట్ సీరిస్‌లో ఇంకో ఆరేళ్లపాటు డోకా లేదు. కానీ టీ20 వన్డే సిరిస్‌లో మాత్రం చోటు దక్కడం చాలా కష్టం. ఇక వాటిపై అశ్విన్ ఆశలు వదులుకోవడం బెటర్ అని నా సలహా’ అంటూ సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్పోర్ట్స్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల చేపాక్ వేదికగా జరిగిన ఇంగ్లండ్ సీరిస్‌లోనూ అశ్విన్ మెరుగ్గా ఆడిన విషయం తెలిసిందే. సెంచరీ కొట్టడంతో పాటు ఐదు వికెట్లు కూడా తీశాడు. దీంతో అతడికి వన్డే టీంలో చోటు పక్కా అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
' ఆర్
అశ్విన్ వన్డే టీ20లోకి రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే
ఇప్పుడు ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా
ఉంటాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఓ స్పిన్నర్ కాంబినేషన్‌తో భారత్ జట్టు
తరచూ బరిలోకి దిగుతోంది. ఈ పరిస్థితుల్లో అతడిని వన్డే టీ20 లో చోటు
దక్కడం చాలా కష్టం’ అని వ్యాఖ్యానించారు.
రవిచంద్రన్ అశ్విన్
కెరీర్ ఆరంభంలో టీమిండియా తరపున అన్ని ఫార్మాట్ లలో ఆడాడు. వన్డే లలో కూడా
అశ్విన్ కు గొప్ప రికార్డ్ లు ఉన్నాయి. అయితే యేజేంద్ర చాహల్ కుల్ దీప్
యాదవ్ వన్డేల్లోకి ఎంట్రీ తర్వాత అశ్విన్ ఇక పొట్టి ఫార్మాట్ కు ఎంపిక
కాలేదు. వాళ్లు అద్భుతంగా రాణిస్తుండటంతో 2017లో చివరిసారి అశ్విన్ వన్డే
మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కేవలం టెస్ట్ మ్యాచ్‌లకు మాత్రమే సెలక్ట్
అవుతున్నాడు.