Begin typing your search above and press return to search.

పుట్టిన రోజు సందర్భం గా రేవ్ పార్టీ.. ఓ మంత్రి బంధువు బుక్

By:  Tupaki Desk   |   6 July 2020 5:45 AM GMT
పుట్టిన రోజు సందర్భం గా రేవ్ పార్టీ.. ఓ మంత్రి బంధువు బుక్
X
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో శనివారం రాత్రి కొందరు యువతీ యువకులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రేవ్ పార్టీ నిర్వహించగా బంజారాహిల్స్ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీని వీటి నిర్వహణలో ఆరితేరిన ఓ పబ్ నిర్వాహకుడు సంతోష్ రెడ్డి సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ఇందులో ఎనిమిదిమంది యువతులు సహా ఆరుగురు యువతులు, ఓ రష్యాన్ యువతిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కలిసి ఈ రేవ్ పార్టీలో రాత్రంతా శృంగార ఢోలికల్లో మునిగి తేలినట్టు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

ఈ సంతోష్ రెడ్డి హైదరాబాద్ లో రేవ్ పార్టీల నిర్వహణలో ఆరితేరి పోయాడని పోలీసులు చెబుతున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో టాట్ పబ్ లో సంతోష్ రెడ్డి సుమారు 30మంది యువతులతో కలిసి రేవ్ పార్టీ ఏర్పాటు చేసి పోలీసులకు దొరికాడు. ఇప్పుడు ఆరు నెలలు గడువక ముందే మరోసారి రేవ్ పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో సంతోష్ రెడ్డితోపాటు భానుకిరణ్, విజయ రామారావు, నగరానికి చెందిన ఓ మంత్రి బంధువు కూడా ఉన్నట్టు సమాచారం. పోలీసులు దీనిపై అధికారికంగా స్పందించారు.

శనివారం రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఓ హోటల్‌లో రేవ్ పార్టీపై సమాచారం అందిందని.. దాడి చేసి రూమ్ నంబర్ 721లోని ముగ్గురు యువకులు, నలుగురు యువతులు మద్యం సేవిస్తూ పార్టీ చేసుకుంటే అదుపులోకి తీసుకున్నామని బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగ రావు మీడియాకు తెలిపారు.వీరంతా రేవ్ పార్టీ నిర్వాహకుడు సంతోష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరైనట్లు వారు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.