500మందితో రేవ్ పార్టీ.. భగ్నం

Sun Dec 08 2019 15:27:41 GMT+0530 (IST)

Rave Party Near Bangalore, Many Held

రేవ్ పార్టీ.. ఫాంహౌస్ లేదా సీక్రెట్ గా శివారు ఇళ్లల్లో అమ్మాయిలతో విచ్చలవిడిగా శృంగారం చేయడానికి ఏర్పాటు చేసుకున్న పార్టీలివీ.. ఈ పార్టీలపై ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా తగ్గడం లేదు. పోలీసుల కఠిన ఆంక్షల నేపథ్యంలో ఈ అక్రమ దందా గాళ్లు కొత్త ఆలోచన చేశారు.తాజాగా కళాశాల ఈవెంట్ పేరుతో రేవ్ పార్టీలను చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి అమ్మాయిలను ఎరగా వేసి రేవ్ పార్టీలను నిర్వహిస్తూ దొరికిపోయారు.

తాజాగా కర్ణాటకలోని రామనగర జిల్లాలో బెంగళూరుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో గల విభూతిపుర గ్రామంలో  గత రాత్రి రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బెంగళూరుకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన 32 ఎకరాల భారీ మామిడితోటలో గల ఫామ్ హౌస్ లో కాలేజీ ఈవెంట్ పేరుతో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ స్వయంగా ఈ దాడిని నిర్వహించారు. కొందరు బడా నేతల కుమారులు ఈ పార్టీలో ఉన్నారు.

బెంగళూరు తమిళనాడుకేరళ నుంచి వచ్చిన యువకులను ఈ పార్టీకి ఆహ్వానించారు.ఈ పార్టీ కోసం ఏకంగా ఒక ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించినట్టు చూసి పోలీసులు షాక్ కు గురయ్యారు. యాప్ ద్వారానే యువతీ యువకులను రేవ్ పార్టీకి రప్పించారు. వారితో రాత్రంతా రేవ్ పార్టీలో ఎంజాయ్ చేయించారు. విచ్చలవిడిగా శృంగారాలు నడిచాయి.. అయితే..

పెద్ద ఎత్తున యువతీ యువకులు గ్రామానికి రావడం.. వందలాది కార్లు రావడంతో గ్రామస్థులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 500 మంది వరకూ యువతీ  యువకులు ఈ పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పలువురు తప్పించుకుపోయారు. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మామిడి తోట యజమానిపై కూడా కేసు పెట్టారు.