రేర్ ఫోన్ కాల్.. సీక్రెట్ లెటర్ తో అభినందన్ ను వదిలేశారట

Sun Feb 28 2021 11:05:45 GMT+0530 (IST)

Rare phone call .. Leave a Abhinandan with a secret letter

పాక్ వైమానిక దాడిని తిప్పికొట్టేందుకు సాహసోపేతంగా వ్యవహరించిన భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ పాక్ ఆర్మీ చేతికి చిక్కటం తెలిసిందే. ఆయన నడుపుతున్న మిగ్ 21 కూలిపోవటం.. దాన్ని తప్పించుకునేందుకు ప్యారాచూట్ సాయంతో పాక్ భూభాగంలోకి దిగారు. తాను ఉన్నదిపాక్ భూభాగంలో అన్న విషయాన్ని అర్థం చేసుకునేలోపే.. అక్కడి స్థానికులు ఆయన్ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం పాక్ ఆర్మీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. దాదాపు 60 గంటల పాటు ఆయన పాక్ నిర్బందంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా భారత సర్కారు అనుసరించిన విధానమే ఆయన్ను భారత్ కు పంపటానికి పాక్ ఒప్పుకున్నట్లుగా చెబుతారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

పాక్ చెరలో ఉన్నవేళలో ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) చీఫ్ అనిల్ ధస్ మనా పాక్ ను గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అభినందన్ కు ఏమైనా అయితే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అంతేకాదు.. చాలా అరుదుగా చేసే ఫోన్ కాల్ చేయటం.. ప్రధాని మోడీ సూచనల మేరకు ఐఎస్ఐ కౌంటర్ పార్ట్ లెఫ్టెనెంట్ గవర్నర్ సయ్యద్ అసిమ్ మునిర్ అహ్మద్ షాకు రహస్య లేఖ ద్వారా తీవ్ర హెచ్చరికల్ని జారీ చేశారు.

అంతేకాదు.. అంతర్జాతీయంగా పాక్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావటంతో దాయాదికి పరిస్థితి అర్థమైంది. తాముఏ మాత్రం తేడాగా వ్యవహరిస్తే.. దారుణ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తించి.. అభినందన్ ను జెనీవా ఒప్పందంలో భాగంగా విడుదల చేయటానికి ఒప్పుకున్నట్లుగా పేర్కొంది. తెర వెనుక జరిగిన పెద్ద తతంగమే అభినందన్ సేఫ్ గా విడుదల కావటానికి అవకాశం ఇచ్చిందని చెప్పక తప్పదు.