Begin typing your search above and press return to search.

సిక్కోలు జిల్లా వాసికి అరుదైన గౌరవం..!

By:  Tupaki Desk   |   19 Jan 2022 12:31 PM GMT
సిక్కోలు జిల్లా వాసికి అరుదైన గౌరవం..!
X
ఇటీవల కాలంలో మహిళలకు సంబంధించిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలు సత్తా చాటుతున్నారు. ఇటీవల మిసెస్ ఇండియా టైటిల్ ను విజయవాడకు చెందిన ఓ వివాహిత గెలుచుకోగా... తాజాగా అలాంటి మరో మూడు టైటిళ్లను శ్రీకాకుళం కు చెందిన ఓ మహిళ గెలుచుకుంది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో అన్నింటిలోనూ అత్యధిక మార్కులను సాధించి టాప్ గా నిలిచింది. ఆమె పేరే పైడి రజని. మిసెస్ ఇండియా ఆంధ్ర ప్రదేశ్ గ్రాండ్ ఫినాలే లో అత్యధిక పాయింట్లు సాధించిన రజిని ఏకంగా మూడు టైటిల్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూడు టైటిల్స్ ను గెలుచుకున్న ఏకైక సిక్కోలు వాసిగా ఆమె రికార్డ్ సృష్టించింది. ఈ టైటిల్ కోసం మొత్తంగా భారతదేశంలోనే అనేక ప్రాంతాల నుంచి వందకు పైగా మహిళలు పాల్గొన్నారు. అయితే వీరిలో కేవలం 38 మంది మాత్రమే ఫైనల్ కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రాండ్ ఫినాలే లో ఉత్తమ ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు పేర్కొన్నారు కానీ అంతిమంగా అత్యధిక పాయింట్లతో పైడ్ రజిని టైటిల్ ను సొంతం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఈ పోటీల్లో రజని మొత్తంగా మూడు టైటిళ్లను సొంతం చేసుకున్నారు. వాటిలో ఒకటి మిసెస్‌ డైనమిక్‌ టైటిల్, రెండోది కల్చరల్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, మూడోది క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ మూడింటిని ఆమె సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి పోటీల్లో పాల్గొనడం అంటే ఎంతో ఇష్టమని రజిని చెప్పారు. అంతేకాకుండా ఈ పథకాలను సొంతం చేసుకోవడం లో తన కుటుంబం ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. ఇందుకుగానూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

రజిని శ్రీకాకుళంలోని పొందూరు మండలం లో జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. తల్లి దేవాదాయ శాఖలో ఉద్యోగం చేశారు. తండ్రి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. భర్త గోపాల్ రావు.. గతంలో పాలకొండ లోని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ కి వైస్ చైర్మన్ గా పని చేశారు. ఇక చదువు విషయానికి వస్తే ఆమె దగ్గరలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ లో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం అదే యూనివర్సిటీ లో పీహెచ్డీ చేస్తున్నారు. మరో వైపు ఆమె ఖాళీ సమయాల్లో ఉపాధ్యాయినిగా కూడా పని చేస్తారు.