Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ పరేడ్ లో మెరిసిన రాఫెల్ లేడి ఫైలెట్.. ఎవరు ఈమె తెలుసా?

By:  Tupaki Desk   |   26 Jan 2022 11:43 AM GMT
రిపబ్లిక్ పరేడ్ లో మెరిసిన రాఫెల్ లేడి ఫైలెట్.. ఎవరు ఈమె తెలుసా?
X
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వైభవంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. జాతీయజెండాను ఎగురవేసి సగౌరవంగా వందనం చేశారు.

దేశ రాజధానిలో గణతంత్ర వేడుకలు ఆకాశాన్ని అంటాయి. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరైన వేళ పరేడ్ రక్షణరంగం సత్తా చాటాలే సాగింది. ప్రదర్శనలో మిగ్ 21,జినాట్, లైట్ కొంబాట్ హెలిక్యాప్టర్, అశ్లేష రాడార్, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రదర్శనలు కనువిందు చేశాయి.

ఈ పరేడ్ లో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచారు ఫ్లైట్ లెఫ్టినెంట్ శివాంగి సింగ్.. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలను నడిపిన మొట్టమొదటి మహిళా పైలెట్ ఆమె. రాఫెల్ యుద్ధవిమానాలతో రూపొందించిన శకటంపై నిల్చుని జాతీయ పతాకాన్ని స్టిఫ్ గా సెల్యూట్ చేస్తూ కనిపించారు.

రాఫెల్ జెట్ ఫైటర్లు భారత్ కు చేరుకున్న తొలి రోజుల్లోనే ఆమె ఫ్లైట్ లెఫ్టినెంట్ గా జాయిన్ అయ్యారు. గోల్డెన్ యూరోస్ స్క్వాడ్రాన్ లో చేరారు.

ఇక శివంగి సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి. చిన్నప్పటి నుంచి ఆకాశంలో విహరించాలనేది ఆమె కల. దాన్ని సాకారం చేసుకున్నారు.వైమానిక దళంలో కూడా చేరారు. 2017 డిసెంబర్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ ప్రతిభతో కలిసి ఎయిర్ ఫోర్స్ లో చేరారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థిని శివంగి సింగ్. వైమానిక దళంలో చేరాలనే లక్ష్యంతో 2016లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పొందారు. చదువుతున్న సమయంలోనే ఎన్సీసీ యూపీ ఎయిర్ స్క్వాడ్రాన్ లో పనిచేశారు.