Begin typing your search above and press return to search.

జల్గావ్ ఘటన: నలుగురు పిల్లల హత్యను ఛేదించిన పోలీసులు

By:  Tupaki Desk   |   18 Oct 2020 9:50 AM GMT
జల్గావ్ ఘటన: నలుగురు పిల్లల హత్యను ఛేదించిన పోలీసులు
X
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన జల్గావ్ జిల్లాలో నలుగురు పిల్లల దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

జల్గావ్ జిల్లా రావేర్ పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న భోర్ ఖేడా గ్రామ సమీపంలోని ఓ పొలంలో పనులు చేసుకుంటూ మహతాబ్-రుమాలీబాయి దంపుతులు తమ ఐదుగురు పిల్లలతో గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్ కు ఈ దంపతులు తమ పెద్ద కుమారుడితోపాటు వెళ్లారు. మిగతా నలుగురు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లారు.

ఈ క్రమంలోనే ఇంట్లో మా నలుగురు తమ్ముళ్లు, చెల్లెల్లు ఉంటారని.. కొంచెం వారిని చూసుకోవాలని మిత్రులకు బిలాల్ పెద్ద కుమార్ చెప్పి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మిత్రులు 13 ఏళ్ల వయసున్న బాలికపై కన్నేశారు. మద్యం తాగి వచ్చి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. విషయం బయటపడుతుందని భయపడ్డ ఆ నలుగురు బాలికతోపాటు మిగతా వారిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి మృతదేహాలను పక్కనే ఉన్న పొలంలో పడేశారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో నలుగురు నిందితులతోపాటు మరో మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఘటన స్థలంలో గొడ్డలి, రక్తంతో తడిసిన దుస్తులు, రెండు నాటుసారా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించాయి.