Begin typing your search above and press return to search.

నిత్యానంద: కైలాసంలోనే ఉంటా.. తమిళనాడు రాను

By:  Tupaki Desk   |   25 Feb 2020 1:30 AM GMT
నిత్యానంద: కైలాసంలోనే ఉంటా.. తమిళనాడు రాను
X
అమ్మాయిలతో తన ఆశ్రమంలో అసాంఘిక కార్యక్రలాపాలకు వినియోగిస్తున్నారని తదితర అంశాల్లో స్వామి నిత్యానందపై భారతదేశంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ సాగుతుండగా నిత్యానంద స్వామి అదృశ్యమయ్యాడు. అయితే ఆ తర్వాత ఇటీవల ఆయన వీడియోలు విడుదల చేశాడు. తాను ఒక దేశాన్ని సృష్టించానని.. ఆ హిందూ దేశంగా రూపకల్పన చేస్తున్నట్లు వీడియాలో ఉంది. దీంతో ఆ వార్త సంచలనమైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ విషయం అంతర్జాతీయ స్థాయిలోకి కూడా వెళ్లింది. ఎందుకంటే భారత్ లో నిందితుడిగా ఉన్న వ్యక్తి విదేశాలకు పరారయ్యాడు. దీంతో అంతర్జాతీయ పోలీసుల (ఇంటర్‌పోల్‌) సాయం కోరిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా మరో వీడియో విడుదల చేసి ఇక తాను తమిళనాడుకు రానని.. తన దేశం కైలాసంలోనే ఉంటానని ప్రకటించాడు. కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని అతడు చెబుతూ ఉణ్న వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. నిత్యానంద కైలాసం నిర్మాణం పూర్తయిందని, ఇకపై తాను తమిళనాడుకు రానని తెలిపాడు. తాను మృతి చెందితే తన భౌతిక కాయాన్ని బిడది ఆశ్రమం లో ఖననం చేయాలని, అదే తన చివరి ఆశ అని చెప్పాడు.

నిత్యానంద ఈక్వెడార్‌ సమీపంలోని కైలాసం పేరుతో కొత్త దీవిని ఏర్పాటుచేసి స్వత్రంత్ర దేశంగా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాడని గతంలో విడుల చేసిన వీడియోలతో తెలిసింది. వరుస కేసులు నమోదవడంతో నిత్యానంద విదేశాలకు పరారయ్యాడు. ప్రస్తుతం విలాస వంతమైన జీవితం గడుపుతున్నాడు. అయితే గుజరాత్‌ పోలీసులు నిత్యానంద కోసం అంతర్జాతీయ పోలీసుల సాయం కోరారు. అయితే ఆ పోలీసులు కూడా నిత్యానంత ఉన్న ప్రాంతాన్ని గుర్తించ లేకపోయారు. స్వామి నిత్యానంద తన కూతుళ్లను కిడ్నాప్ చేసి అహ్మదాబాద్‌ ఆశ్రమంలో నిర్బంధించారంటూ బెంగళూరుకు చెందిన జనార్దన్‌ శర్మ గుజరాత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.