కేసీఆర్ కుమార్తె కవితకు రామోజీ లేఖ... ఏమన్నారంటే!

Sun Nov 28 2021 23:10:34 GMT+0530 (IST)

Ramoji letter to KCR daughter Kavita

ఈనాడు మీడియా సంస్థల అధిపతి రామోజీ గ్రూపు చైర్మన్ రామోజీరావు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవితకు లేఖ రాశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండడం గమనార్హం. వాస్తవానికి రామోజీరావుకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. వాటిని గుట్టుగానే సాగిస్తారు. ఎక్కడా బయపడే ప్రయత్నం చేయరు. గతంలో ఎన్టీఆర్.. తర్వాత.. చంద్రబాబు.. అదేవిధంగా కేసీఆర్.. కాంగ్రెస్ నేతలనూ రామోజీకి పటిష్టమైన స్నేహసంబంధాలు ఉన్నాయి.అయితే.. ఎప్పుడు రామోజీ.. ఎవరికీ బహిరంగ లేఖలు రాయడం అనేది లేదు. ఒకవేళ ఉన్నా.. అది వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు వివాదం ఏర్పడినప్పుడు.. నేరుగా తన పత్రికలోనే వైఎస్‌ను ఉద్దేశించి లేఖలు సంధించారు. వైఎస్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. తను కూడా వైఎస్‌కు కొన్ని ప్రశ్నలు సంధించారు.కానీ ఎప్పుడూ.. ఎవరినీ.. నేరుగా పొగిడిన సందర్భం రామోజీ నుంచి మనకు కనిపించదు. కానీ తాజాగా ఆయన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఉద్దేశించి పొగుడుతూ.. అదేసమయంలో దీవిస్తూ.. ఒక లేఖ రాశారు.

రామోజీ గ్రూపు్ లెటర్ హెడ్పై రామోజీరావు రాసిన ఈ లేఖ సారాంశం ఏంటంటే.. ``శ్రీమతి కవితగారికి నమస్కారం. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు హార్ధిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ను. ఎమ్మెల్సీ ఎన్నిక్లోల విజయ పరంపర కొనసాగించి ప్రాబల్యం చాటుకున్న మీరు.. శాసన మండలిలో ప్రజావాణిని మరింత గట్టిగా వినిపించి జననాయకురాలిగా ఇనుమడించిన కీర్తి గడిస్తారని.. విశ్వసిస్తున్నాను. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించి అందరి మన్ననలందుకుంటారని భావిస్తూ..మీ రామోజీరావు!`` అని పేర్కొన్నారు.