Begin typing your search above and press return to search.

28 ఏళ్ల త‌ర్వాత‌.. మోడీ శ‌ప‌థం నెర‌వేర‌బోతోంది

By:  Tupaki Desk   |   1 Aug 2020 5:36 PM GMT
28 ఏళ్ల త‌ర్వాత‌.. మోడీ శ‌ప‌థం నెర‌వేర‌బోతోంది
X
2020 ఆగ‌స్టు 5.. భార‌తీయ హిందువులు మ‌రిచిపోలేని రోజు. దేశవ్యాప్తంగా హిందువులంతా ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రోజు ఇదే. ఇంకో మూడు రోజుల్లోనే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగబోతోంది. ఆగస్టు 5న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కేంద్ర, ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జరగనుంది. ఇప్పుడు రామ మందిరం నిర్మించబోయే చోట ఒకప్పుడున్న రామాలయాన్ని కూల్చి కట్టినట్లుగా చరిత్రకారులు చెబుతున్న బాబ్రీ మసీదును కూలగొట్టడంలో మోడీ పాత్ర కీలకం. 1992 డిసెంబరు 6న జరిగిన ఆ ఘట్టంలో మోడీ ఎంతో కీలకంగా వ్యవహరించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

అయితే ఆ త‌ర్వాత అయోధ్య‌లో రామ మందిరం నిర్మించాల‌ని.. క‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయాల‌ని అదే స‌మయంలో మోడీ తిరంగా యాత్ర చేప‌ట్టాడు. మ‌ళ్లీ తాను అయోధ్య‌కు వ‌స్తే రామ‌మందిర నిర్మాణ శంకుస్థాప‌న‌కే వ‌స్తాన‌ని శప‌థం పూనారు. అన్న‌ట్లుగానే ఇప్పుడు మోడీ ప్ర‌ధానిగా ఉండ‌గా రామ మందిర నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌ర‌గ‌బోతోంది. ఇలా త‌న చేతుల మీదుగా ఆల‌యానికి శంకు స్థాప‌న చేసేందుకు మోడీ వ‌స్తాడ‌ని.. 28 ఏళ్ల త‌ర్వాత‌ ఇలా త‌న శ‌ప‌థాన్ని నెర‌వేర్చుకుంటాడ‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. అప్పుడు మోడీ కోరుకున్న ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ఇదే ఏడాది మోడీ స‌ర్కారు ఆధ్వ‌ర్యంలోనే జ‌ర‌గ‌డం విశేషం.