Begin typing your search above and press return to search.

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది వారం పాటుసస్పెండ్ !

By:  Tupaki Desk   |   21 Sep 2020 6:30 AM GMT
రాజ్యసభలో గందరగోళం.. 8 మంది వారం పాటుసస్పెండ్ !
X
వ్యవసాయ బిల్లులపై తీవ్ర దుమారం రేగుతోంది. అనుకున్నట్లుగా రాజ్యసభలో రచ్చ రచ్చ జరిగింది... జరుగుతోంది. అయితే , ఆదివారం ఆ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాలు రైతులకు నష్టం చేకూర్చి కార్పొరేట్లకు లాభం కలిగించే ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు, శివసేన, వైసీపీ మాత్రమే మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌, టీఆర్ ఎస్, అన్నాడీఎంకే, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆమాద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

అయితే, ఈ వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ సమయంలో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది. ఇక, నేడు కూడా అదే సీన్ రిపీట్ అయింది పెద్దల సభలో. ఆదివారం రోజు రాజ్యసభ ఉపాధ్యక్షుడు పట్ల వ్యవసాయ బిల్లులు ఆమోదం సందర్భంగా, అనుచితంగా వ్యవహరించినందుకు గాను ప్రతిపక్షాలకు చెందిన 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్, సీపీఐ, ఆప్‌ కు చెందిన ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సభలో ప్రకటించారు. చైర్మన్ సీటును చుట్టుముట్టడం, బిల్లులను చించివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. సభా సాంప్రదాయాలను అంతా పాటించాలని, చైర్మన్ స్థానాన్ని అందరూ గౌరవించాలని వెంకయ్య చెప్పారు.

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020ను మూజువాణి ఓటుతో ఈ నెల 17న లోక్‌సభ ఆమోదించింది. ఇక తృణధాన్యాలు, పప్పులు, ఉల్లిపై నియంత్రణ ఎత్తివేసే.. నిత్యవసర ఉత్పత్తుల బిల్లు-2020ను మంగళవారం ఈనెల 15న ఆమోదించింది. ఈ సంస్కరణలు రైతులకు లాభదాయకంగా ఉంటాయని ప్రభుత్వం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రైతులకు నష్టం జరుగుతుందని మండిపడుతున్నాయి.