ఆర్ ఎస్ ఎస్ ఒక ఉగ్రవాద సంస్థ .. ఎవరన్నారంటే?

Mon Jan 27 2020 17:53:21 GMT+0530 (IST)

Rajratna Ambedkar calls RSS an Indian Terrorist organisation

భారత దేశంలో ఆర్ ఎస్ ఎస్  ఒక ఉగ్రవాద సంస్ధ అని దాన్ని నిషేంధించాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు రాజారత్నం అంబేద్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే రోజున  కర్ణాటకలోని  బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అయన ...  భారతదేశ ఉగ్రవాద సంస్థ ఆర్ ఎస్ ఎస్ అని గతంలోనే చెప్పాను అని గుర్తు చేశారు. ఆర్ ఎస్ ఎస్ సంస్థను దేశంలో నిషేధించాలని  ఆయన డిమాండ్ చేశారు.బీజేపీ ఎంపీ సాధ్వి ప్రాగ్యా సింగ్ ఠాకూర్ - మోడీ పక్కన కూర్చొని మాట్లాడుతూ.. భారత ఆర్మీలో ఆయుధాలు - మందుగుండు సామాగ్రి అయిపోయినప్పడు - ఆర్ ఎస్ ఎస్ సంస్థ ఆర్మీకి వాటిని అందించిందని ఆమె చెప్పినట్లు రాజారత్న తెలిపారు.  అసలు ఆర్ ఎస్ ఎస్ ఒక సంస్థ అయితే  - ఆ సంస్థకు ఆయుధాలు - మందుగుండు సామాగ్రి ఎక్కడ్నుంచి వచ్చిందని రాజారత్న అంబేడ్కర్  ప్రశ్నించారు.