Begin typing your search above and press return to search.

రాజ్‌ నాథ్ సింగ్ కీలక నిర్ణయం - రక్షణ శాఖలో 101 వస్తువులపై ఆంక్షలు

By:  Tupaki Desk   |   9 Aug 2020 7:37 AM GMT
రాజ్‌ నాథ్ సింగ్ కీలక నిర్ణయం - రక్షణ శాఖలో 101 వస్తువులపై ఆంక్షలు
X
కరోనా మహమ్మారి తర్వాత భారత్ ఆత్మనిర్భర్ దిశగా మరో అడుగు వేస్తోంది. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల తర్వాత ప్రజల్లోను మార్పు కనిపిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్‌ ను ప్రోత్సహించేందుకు రక్షణశాఖ 101 వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. నిర్ణీత గడువులోగా దీనిని అమలు చేస్తామని - ఆయుధాలు - ఇతర రక్షణ వస్తువులు దేశీయంగా మనమే తయారు చేసుకునేందుకు ఉపకరిస్తుందన్నారు.

రక్షణ శాఖ నిర్ణయం దేశీయంగా రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుంది. ఇది భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని, డీఆర్డీవో సాంకేతిక పరిజ్ఞానానికి ఊతమిచ్చినట్లవుతుందని చెప్పారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు భారత సైన్యం - ప్రభుత్వం - ప్రయివేటు పరిశ్రమతో చర్చించి కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించినట్లు రాజ్‌ నాథ్ తెలిపారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుండి దాదాపు రూ.3.5 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చామన్నారు.

రానున్న ఆరేడు సంవత్సరాల్లో దేశీయ పరిశ్రమకు రూ.4 లక్షల కోట్ల ఆర్డర్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రక్షణ శాఖ ఉత్పత్తులను దేశీయంగా తయారు చేస్తామని, సాయుధ దళాల అవసరాలను గుర్తించి రక్షణ పరిశ్రమకు తెలియజేస్తాయన్నారు. ఈ విస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు గడువు కూడా విధిస్తామన్నారు. శాఖాపరంగా ఇది చారిత్రాత్మక అడుగు అన్నారు. ఆంక్షలు విధించిన జాబితాలో ఆర్టిల్లరీ గన్స్ - అసల్ట్ రైఫిల్స్ - కార్వెట్స్ - సోనార్ సిస్టమ్స్ - ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ - ఎల్‌ సీహెచ్ - రాడార్లు వంటివి ఉన్నాయి.