Begin typing your search above and press return to search.

రజినీ వర్సెస్ విజయ్.. రంజుగా తారల ఫైట్

By:  Tupaki Desk   |   24 Feb 2020 3:30 PM GMT
రజినీ వర్సెస్ విజయ్.. రంజుగా  తారల ఫైట్
X
తమిళనాట తారల రాజకీయం రంజుగా మారుతోంది. తమిళ స్టార్ హీరో, ఇళయదళపతి విజయ్ రాజకీయ అరంగేట్రానికి రెడీ కావడం తమిళ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. ఇటీవల కాలంలో విజయ్ తన సినిమాల్లో బీజేపీ, అధికార ఏఐడీఎంకే విధానాలను తీవ్రంగా విమర్శించారు. బహిరంగంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. దీంతో సీరియస్ అయిన బీజేపీ ఆయనపై ఐటీ దాడులు చేయించింది. ఈ నేపథ్యంలో విజయ్ ను తమ పార్టీలో చేర్చుకొని బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధించవచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీఎంకే భావిస్తోంది.

వాస్తవానికి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ్ చిత్రం విడుదల కాకుండా అప్పట్లో అడ్డుకున్నారు. అప్పటి నుంచి విజయ్ ఏఐడీఎంకేతో గొడవ పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా తమిళ పాలిటిక్స్ లోకి రజినీకాంత్ వస్తున్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా రాజకీయం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికే విజయ్ ఉద్దేశ పూర్వకంగా ముందుకు వస్తున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఆయన వెనుక కాంగ్రెస్, డీఎంకే ఉండవచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రజినీకాంత్ తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ-ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకొని పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రచారం సాగుతోంది. ఏఐడీఎంకేతో ఉన్న వైరం కారణంగానే విజయ్ డీఎంకే-కాంగ్రెస్ తో కలవబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ ను తమ పార్టీలో చేర్చుకొని బాధ్యతలు అప్పగిస్తే అధికారం సాధించవచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీఎంకే భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తన ద్వారాలు తెరిచిందనే చెప్పాలి.

రజినీకాంత్ కు వ్యతిరేకంగా విజయ్ రాజకీయాల్లో వస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని రాజకీయంగా వాడుకోవాలని డీఎంకే- కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో తారల ఫైట్ రాజకీయాల్లో రంజుగా మారనుంది.