దేశంలోనే అత్యధిక ఫైన్.. ఎంతో తెలుసా?

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

Rajasthan Truck Driver Fined Rs 1.41 Lakh In Delhi for overloading

కొత్త వాహనచట్టం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తప్పు చేసిన వారికి విధిస్తున్న ఫైన్లు ఠారెత్తిస్తున్నాయి. వేలు దాటి ఇప్పుడు లక్షల ఫైన్లు వేసే పరిస్థితి దాపురించింది. మొన్నటికి మొన్న ఓ బైకర్ కు రూ.27వేల ఫైన్ వేశారు. అది మరిచిపోకముందే ఈ మధ్యనే ఓ లారీ డ్రైవర్ కు 80వేల ఫైన్ వేశారు. దేశంలోనే ఇప్పటివరకు ఇదే అత్యదికం.అయితే ఆ ఫైన్ తలదన్నేలా తాజాగా బుధవారం ఓ రాజస్థాన్ కు చెందిన ట్రక్కు డ్రైవర్ కు దేశంలోనే అత్యధిక జరిమానాను విధించారు పోలీసులు. పరిమితికి మించి ఓవర్ లోడ్ తో వెళుతున్న అతడికి ఏకంగా 141700 జరిమానా విధిస్తూ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఈ ఫైన్ అత్యంత భారీది కావడం గమనార్హం.

ట్రాఫిక్ నిబంధనలతో ఇప్పుడు రోడ్డుమీదకు రావాలంటేనే జనాలు హడలిచస్తున్నారు. హెల్మెట్ సహా అన్ని పత్రాలు తీసుకొనే రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు దేశంలోనే ఇంత భారీ ఫైన్ చూశాక ఇక మరింత అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ భారీ ఫైన్లు అమలు కాలేదు. చట్టం అమలును తెలుగు రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయకపోవడంతో ఫైన్లు ఇప్పటివరకు భారీగా పడడం లేదు. మనకూ కూడా మొదలైతే ఇక వాహనదారులకు దబిడదిబిడే..