15కోట్లు.. మంత్రిపదవి.. ప్రభుత్వాన్ని కూల్చే ఆఫర్?

Sat Jul 11 2020 20:00:13 GMT+0530 (IST)

15 crore .. ministerial post .. offer to overthrow the government?

బోటా బోటా మెజార్టీతో ఉన్న మధ్యప్రదేశ్ లో ఈ కరోనావ్యాప్తికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ గద్దెనెక్కింది. కాంగ్రెస్ యువనేత జ్యోతిరాధిత్య సింధియాను బీజేపీవైపు తిప్పుకొని ఎమ్మెల్యేలను లాగేసి కొలువుదీరింది.ఇప్పుడు బీజేపీ చూపు రాజస్థాన్ పై పడిందట.. రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15కోట్లు మంత్రి పదవి కూడా ఆఫర్ చేస్తున్నారని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా అలజడి సృష్టించేందుకు బీజేపీ పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. కర్ణాటక మధ్యప్రదేశ్ మాదిరిగా రాజస్థాన్ లోనూ బీజేపీ రాజకీయం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరికీ డబ్బులు.. మరికొందరికీ పదవులు ఇస్తామని మభ్య పెడుతున్నారని ఆరోపించారు.

బీజేపీ చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.సీబీఐ ఈడీ పేరుతో బీజేపీ కాంగ్రెస్ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు.

అయితే కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జోషి తోసిపుచ్చారు. తాము కుషల్ ఘడ్ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరపలేదని క్లారిటీ ఇచ్చారు.