Begin typing your search above and press return to search.

ఏడేళ్ల బుడ్డోడు కోసం ఫోన్ చేసిన రాహుల్!

By:  Tupaki Desk   |   19 April 2019 8:18 AM GMT
ఏడేళ్ల బుడ్డోడు కోసం ఫోన్ చేసిన రాహుల్!
X
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ వ‌చ్చిందంటే చాలు. . అదే గొప్ప అఛీవ్ మెంట్ గా ఫీల‌య్యే వారు దేశంలో ల‌క్ష‌లాది మంది ఉన్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ అన్నా.. ఆపార్టీ అధినాయ‌క‌త్వం అన్నా ఏపీ ప్ర‌జ‌లు ఇప్ప‌టికి ఛీద‌రించుకుంటున్నారు. తెలంగాణ ఇస్తే.. ఇక ఎప్ప‌టికి ఆ రాష్ట్రం త‌మ‌కు అధికారాన్ని ఇచ్చేస్తార‌న్న అత్యాశ ఎంత త‌ప్ప‌న్న విష‌యం ఇప్ప‌టికే అర్థ‌మైనప్ప‌టికి ఏమీ చేయ‌లేని దుస్థితి.

రెండు తెలుగు రాష్ట్రాల్ని ప‌క్క‌న పెడితే..కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అన్నా.. ఆ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ అన్నా అభిమానించేవారు.. ఆరాధించేవారు లేక‌పోలేదు. అలాంటి అభిమానానికి నిలువెత్తు రూపం ఏడేళ్ల కుర్రాడు నంద‌న్‌. కేర‌ళ‌కు చెందిన ఈ చిన్నారికి రాహుల్ అంటే మ‌హా ఇష్టం. అత‌గాడు కేర‌ళ వ‌స్తున్న విష‌యం తెలుసుకొని.. నేరుగా చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు.

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో జ‌రుగుతున్న స‌మావేశం గురించి తెలిసిన నంద‌న్ త‌ల్లిదండ్రులు త‌మ చిన్నారిని తీసుకొని అక్క‌డ‌కు వెళ్లారు. ఉద‌యం ఐదు గంట‌ల‌కు స‌మావేశం జ‌రిగే ప్ర‌దేశానికి వెళ్ల‌గా.. రాహుల్ 9 గంట‌ల వేళ‌లో వ‌చ్చారు. ఆయ‌న్ను క‌లిసేందుకు బుడ్డోడికి అనుమ‌తి ల‌భించ‌లేదు. రాహుల్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది క‌లిసేందుకు నో చెప్పారు. ఇవేమీ తెలియ‌ని రాహుల్.. మీటింగ్ పూర్తి అయిన వెంట‌నే త‌న దారిన తానువెళ్లిపోయాడు. దీంతో ఏడేళ్ల చిన్నారి తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాడు.

ఈ విష‌యాన్ని నంద‌న్ తండ్రి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ విష‌యం కంట ప‌డిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త ఒక‌రు నేరుగా రాహుల్ వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.దీంతో.. స్పందించిన రాహుల్ వెంట‌నే నంద‌న్ త‌ల్లికి ఫోన్ చేశారు. హాయ్.. నేను రాహుల్ గాంధీని. నేను మీ అబ్బాయితో మాట్లాడొచ్చా? అని అడిగారు. ఇక‌..ఆ త‌ల్లి ఆనందం అంతా ఇంతా కాదు. వెంట‌నే నంద‌న్ కు ఫోన్ ఇవ్వ‌టం.. ఆ చిన్నారితో రాహుల్ కాసేపు ముచ్చ‌టించారు. ఈ విష‌యాన్ని వ‌య‌నాడ్ ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు. ఎన్నిక‌ల ప్ర‌భావ‌మో.. వయనాడ్ అవ‌స‌ర‌మో.. లేక నిజంగానే ఫీల్ అయ్యారో కానీ.. ఏడేళ్ల చిన్నారి కోసం రాహుల్ ఫోన్ చేయ‌టం మాత్రం ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.