Begin typing your search above and press return to search.

చంద్రబాబా...మరోసారి ఆలోచించండీ..

By:  Tupaki Desk   |   18 Dec 2018 3:47 PM GMT
చంద్రబాబా...మరోసారి ఆలోచించండీ..
X
"చంద్రబాబు నాయుడిని నమ్మె పరిస్దితి లేదు. ప్రజలు కూడా ఆయన్ని విశ్వసించటం లేదు. తెలంగాణలో మనం రాంగ్‌ స్టెప్‌ వేసాము." కాంగ్రెస్ పార్టీ సినీయర్ నేత వ్యాఖ్య.

"తెలంగాణలో చంద్రబాబు నాయుడు అంత ప్రచారం చేయకుండా ఉండాల్సింది." తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్.

"చంద్రబాబు నాయుడు ఇక్కడకు వచ్చి చాల తప్పు చేసారు. ఆయన రాక వల్ల మేం లాభపడ్డాం." తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు.

ఇదీ తెలుగదేశం జాతీయాధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై పలు రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం. దేశ వ్యాప్తంగా తానే సినీయర్ నాయకుడినని - తనను మించిన వారు లేరని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. చంద్రబాబు నాయుడు పట్ల తెలుగు ప్రజలలోను - జాతీయ స్దాయిలోను తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇందుకు ఉదాహరణగా తెలంగాణ ఎన్నికలను చూపిస్తున్నారు. రానున్న సర్వాత్రిక ఎన్నికలలో తెలుగుదేశంతో పొత్తు వద్దని కాంగ్రెస్ అధినాయుకుడు రాహుల్ గాంధీకి తెలంగాణ నాయకులు - జాతీయ నాయకులు కూడా సూచిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అది కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందని ముందు నివేదికలు వచ్చాయి. ఈ నివేదికల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే సింగిల్‌ గా పోటీ చేయాలని భావించారు. అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉందని భావించి ఆ పార్టీతో చేతులు కలిపారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది. తెలుగు ప్రజలలో తెలుగుదేశం పార్టీ పట్ల - చంద్రబాబు నాయుడి పట్ల ఉన్న వ్యతిరేకత బహిర్గతమైంది. దీంతో రానున్న సర్వాత్రిక ఎన్నికలలో చంద్రబాబుతో కలసి పోటీ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలోను తీవ్రంగా నష్టపోతామని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్దాయలో కూడా చంద్రబాబుతో చెలిమి అంత మంచిది కాదని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సూచించినట్లు సమాచారం. చంద్రబాబును నమ్మి తెలంగాణలో ఎలాంటి దెబ్బ తిన్నామో జాతీయ స్దాయిలో కూడా అలాంటి దెబ్బె తగులుతుందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబు నాయుడిని వదుల్చుకోవడం కష్టంగా మారిందని అంటున్నారు.