Begin typing your search above and press return to search.

మోడీ 3 నిర్ణయాలతో 14 కోట్ల ఉద్యోగాలు పోయాయి!!

By:  Tupaki Desk   |   9 Aug 2020 5:00 PM GMT
మోడీ 3 నిర్ణయాలతో 14 కోట్ల ఉద్యోగాలు పోయాయి!!
X
ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. యువతకు ఉపాధి కల్పించడంలో ఘోర వైఫల్యం చెందిందని - ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని ప్రకటించిన మోడీ అధికారంలోకి వచ్చాక దానిని నిలబెట్టుకోలేక పోతున్నారని ఆరోపించారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని - దీంతో కోట్లాది ఉద్యోగాలు పోయాయన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ నిమిషంన్నర ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. దీనిని తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు.

కోట్లాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వంపై నిరుద్యోగులు - యువత ఒత్తిడి పెంచాలని - ఇందుకు ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఏకంగా 14 కోట్ల మంది వీధిన పడ్డారన్నారు.

నోట్ల రద్దు - జీఎస్టీ - లాక్ డౌన్ వంటి తప్పుడు విధాన నిర్ణయాలతో కోట్లాది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడు నిర్ణయాలు దేశ ఆర్థిక మూలాలనే ధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ తిరోగమనం దిశగా ఉన్నాయని, ఇలాంటి వాటితో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. యువతకు ఉద్యోగాల కోసం తమ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని చేపడుతుందన్నారు.