Begin typing your search above and press return to search.

రాహుల్ దెబ్బ..బీజేపీ అబ్బా..ఏమైందంటే?

By:  Tupaki Desk   |   19 Nov 2019 9:11 AM GMT
రాహుల్ దెబ్బ..బీజేపీ అబ్బా..ఏమైందంటే?
X
ప్రస్తుతం రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధాని మోడీ గా దేశ రాజకీయం సెగలు కక్కుతోంది. కొన్ని రోజుల క్రితం ఒక సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో నిధులు సమీకరించిన పార్టీగా బిజెపి నిలిచింది. 700 కోట్ల రూపాయలకు పైగా బిజెపి గత ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఫండ్స్ రాబట్టుకుంది. బిజెపి నిధుల సమీకరణపై రాహుల్ గాంధీ - ప్రియాంక చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఇంతకీ ప్రియాంక బీజేపీ నిధుల సమీకరణపై ఏమన్నది ? రాహుల్ గాంధీ ఏమన్నాడు ? అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.. అవినీతిని నిర్మూలనే తమ లక్ష్యం అంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ - అవినీతి సొమ్ముతోనే బిజెపి ఖజానా నింపుతున్నారంటూ ప్రియాంక గాంధీ వధేరా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తన సోదరి ప్రియాంక వ్యాఖ్యలను సమర్థించిన రాహుల్ గాంధీ.. కొత్త భారతావనిలో అవినీతి సొమ్మును ఎలక్టోరల్ బాండ్స్ అని పిలుస్తారంటూ ట్వీట్ చేసి ఈ వివాదానికి తేరా తీశారు. ఒకవైపు ప్రియాంక - మరోవైపు రాహుల్ బీజేపీ టార్గెట్ గా వ్యూహం పన్నడంతో దేశ రాజకీయ ఆసక్తికరంగా మారింది.

గత అయిదేళ్ళలో నరేంద్ర మోదీ సాయం చేసిన వ్యక్తులు - వ్యాపార సంస్థలు - పారిశ్రామిక వేత్తలు బిజెపికి ఎలక్టోరల్ బాండ్స్ పేరిట నిధులను ఇచ్చారని - ఇది పరోక్షంగా క్విడ్ ప్రో ఖో అని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మరో అడుగు ముందుకేసి - మోదీ ప్రభుత్వ క్విడ్ ప్రో ఖో ఒప్పందాలకు అనుగుణంగానే బిజెపికి ఫండ్స్ వెల్లువలా వచ్చాయని ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మనీ లాండరింగ్‌ ను ఎంకరేజ్ చేసేదిగా వుందని - అసలు బిజెపికి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చందాలిచ్చిన వారి వివరాలను బహిర్గతం చేయాలని రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో న్యూ ఇండియాలో లంచాలు - చట్ట వ్యతిరేక వసూళ్ళను ఎలక్టోరల్‌ బాండ్లు అని పిలుస్తారు అంటూ రాహుల్‌ గాంధీ ట్విట్ చేయడం దుమారం రేపుతోంది. ఈ విషయంలో కొందరు రాహుల్ ని సమర్దిస్తున్నా కూడా మరికొందరు మాత్రం అధికారంలో వున్న పార్టీకి నిధులు ఎక్కువ స్థాయిలో రావడం సహజమేనని, దాన్ని అవినీతి డబ్బుగా చెప్పడం కరెక్టు కాదని చెప్తున్నారు.