రఘు రామ తాజా లేఖ వ్యూహం ఇదేనట!

Mon Jun 14 2021 11:59:18 GMT+0530 (IST)

Raghu Rama's latest letter strategy is here

సొంత పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్న నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఏపీ అధికారపక్షం షాకివ్వటం తెలిసిందే. తాజాగా వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న తమ పార్టీ ఎంపీల జాబితాలో రఘురామ పేరును తొలగించటం తెలిసిందే. ఈ మార్పుపై తాజాగా ఎంపీ రియాక్టు అయ్యారు. పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.తాజాగా రాసిన లేఖ వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. పార్టీ నుంచి సమాధానాన్ని కోరటం.. ఒకవేళ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వస్తే.. వాటి ఆధారంగా తనను తాను స్వతంత్ర సభ్యుడిగా ప్రకటించే ఎత్తుగడతోనే లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. పార్టీ నుంచి తనను బహిష్కరించారా? లేదంటే పొరపాటున పేరు తొలగించారా? కావాలనే చేశారా? అనే విషయాలపై తనకు క్లారిటీ ఇవ్వాలని కోరారు.  

పార్టీ వెబ్ సైట్ నుంచి తన పేరును తొలగించిన స్థానంలో 48 గంటల్లో పేరు చేర్చకపోతే.. తాను కావాలనే తన పేరును తొలగించినట్లుగా భావిస్తానని.. ఇదే విషయాన్ని పార్లమెంటు సెక్రటేరియట్ దృష్టికి తీసుకెళతామన్నారు. అదే జరిగితే తనను తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదంతా ఎందుకంటే.. రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకునే పరిస్థితి ఉంటే.. 2024 వరకు ఆయన పదవికి ఎలాంటి ఢోకా ఉండదని చెబుతున్నారు. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న వేళ.. రఘురామ లేఖకు పార్టీ స్పందిస్తుందా? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.