Begin typing your search above and press return to search.

‘ రా బావ తిని చూడు’.. ఈ పేర్లు ఎక్కడి వరకు వెళతాయో?

By:  Tupaki Desk   |   7 March 2021 12:30 AM GMT
‘ రా బావ తిని చూడు’.. ఈ పేర్లు ఎక్కడి వరకు వెళతాయో?
X
‘ఆంధ్రా భోజనం’.. ‘ఉడిపి హోటల్’.. ‘సాయి హోటల్’.. ‘రామ విలాస్’ లాంటి పేర్లకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా రోటీన్ కు భిన్నంగా ఫుడ్ కోర్టులకు పేర్లు పెట్టటం ఫ్యాషన్ గా మారింది. పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో కానీ.. ముందైతే.. హోటల్ కు పెట్టిన పేరుతోనే పాపులర్ కావాలన్న ఆలోచన అంతకంతకూ ఎక్కువైంది. ఈ కారణంతో ఇప్పటివరకు వినని.. కనీసం కలలో కూడా రాని పేర్లు తెర మీదకు వస్తున్నాయి.

‘సెకండ్ వైఫ్’.. ‘మన్మద టిఫిన్ సెంటర్’..లాంటి పేర్లను కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికే ఎందుకు ఆగాలి.. మరింత ముందుకు వెళ్లాలని భావించారో ఏమో కానీ.. తాజాగా ఒక హోటల్ కు పెట్టిన పేరు హాట్ టాపిక్ గానే కాదు.. అందరూ ఆ హోటల్ గురించి మాట్లాడుకునేలా చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ హోటల్ పేరు ఏమిటో తెలుసా? ‘‘రా బావా తిని చూడు’. చదివనంతనే సరికొత్తగా అనిపించటమే కాదు.. కిరాక్ పుట్టించేలా సెట్ చేసిన ఈ హోటల్ బోర్డు ఇప్పుడు అమితంగా ఆకర్షిస్తోంది. వైరల్ గా మారిన ఈ హోటల్ నేమ్ బోర్డులో.. ఆర్ వీఎస్.. పుడ్ బడ్డీ అన్న పేర్లను ఇంగ్లిషులోరాసి.. కింద మాత్రం పెద్ద అక్షరాలతో..‘రా బావ తిని చూడు’అంటూ ఒక అమ్మాయి వయ్యారంగా చేతిలో ఫుడ్ బౌల్ ను పట్టుకున్న తీరు ఆకట్టుకునేలా మారింది.

ఈ హోటల్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? అన్న వివరాలు తెలీటం లేదు కానీ.. చాలామందిఈ పిక్ ను మాత్రం షేర్ చేస్తుండటంతో వైరల్ గా మారింది. మరికొందరు కొంటె బావలు మాత్రం.. ఇంకా నయం.. మరదలు పిలుస్తోంది రా బావ అని పెట్టలేదంటూ జోకులు వేస్తున్నారు. మొత్తానికి ‘రా బావ తిని చూడు’ హోటల్ ఎలానడుస్తోందో కానీ.. పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పక తప్పదు.